పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సినిమాలలో నటించడం జరిగింది... అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.అయితే కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.  అయితే పవన్ నటించిన సినిమాలలో అజ్ఞాతవాసి సినిమా పవన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో అజ్ఞాతవాసి ఒకటి. అయితే పవన్ నటించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా  2018 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కావడం జరిగింది.

అయితే ఈ సినిమా  ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఆకట్టుకోలేకపోవడంతో పాటు ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అనే కామెంట్లు సైతం వినిపించాయి. ఇక ఈ సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తైంది.  పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో  అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా  నటించారు.దీని తర్వాత ఈ హీరోయిన్లకు సైతం సినిమా ఆఫర్లు తగ్గాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్లు 57 కోట్ల రూపాయలు కాగా.... నష్టాలు 58 కోట్ల రూపాయలు అని సమాచారం.ఇక ఈ సినిమా రికార్డు స్థాయిలో అజ్ఞాతవాసి సినిమాకు బిజినెస్ జరగడం వల్లే ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయట.

అయితే అప్పట్లో పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత అదే కాంబోలో  తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే ఈ సినిమా  అటు క్లాస్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో  ఈ సినిమా ఫెయిలైంది. ఇకపోతే ఈ సినిమా ద్వారా బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. ఇక ఆ బయ్యర్లను ఆదుకోవడానికి నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేశారు.  అంతే కాకుండా పవన్ నటించిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇక ఈ సినిమా తర్వాత రాజకీయాలతో బిజీ గా మారాడు పవర్ స్టార్.బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు.  ఇక పవన్ రాజకీయాలలోకి వెళ్ళినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: