ఈ క‌థ ఎక్క‌డ ఆగింది? ఎక్క‌డ మొద‌ల‌యింది? ఈ రెండు ప్ర‌శ్న‌లకూ ఈ సినిమానే జ‌వాబు ఇస్తుంది. అవును!ఈ సినిమా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌న్న‌ది ఇండ‌స్ట్రీతో స‌హా అంద‌రి సినిమా అభిమానుల కోరిక. ఫ‌లితంగా ఈ సినిమా బ‌తికితే ఓ వెయ్యి కుటుంబాల కు అన్నం పెట్టిన వేళ నిజంగానే ఆ సంస్థ అన్న‌పూర్ణ.. సో.. ట్రైట‌ర్ అదిరింది క‌నుక డైరెక్ట‌ర్ కు మ‌రోసారి కంగ్రాట్స్..

చుట్టూ అంద‌మ‌యిన భామ‌లు
వారితో అచ్చ‌ట్లూ ముచ్చ‌ట్లూ
సోగ్గాడు మాట‌ల‌కు
మీసాలున్న చందురుడి మాట‌ల‌కు
ముగ్ధ మ‌నోహర సోయ‌గాలు ఫిదా
పండుగ వేళ ఇంటిల్ల‌పాదీ కూడా ఫిదానే!

అవును! ఈ సినిమా..పండుగ సినిమా..మ‌న పెద్ద‌ల పండుగ‌కు వ‌స్తున్న కొత్త శోభ‌ను క‌ల‌బోసుకుంటున్న సినిమా.ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే చూడాలి అన్న నాగ్ ఆలోచ‌న త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చ‌నుంది. ఎలానూ ఏపీ లోనైట్ క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు ఇచ్చారు క‌నుక ఇంకేం ఈ పండుగ ఎప్ప‌టిలానే అక్కినేని కుటుంబానిది.. ఏఎన్నార్ లివ్స్ ఆన్....


ట్రైల‌ర్ అద‌ర‌గొట్టాడు..మామూలుగా కాదు నాగ్ ఫ్యాన్స్  కు పూన‌కాలే.. అంత బాగుంది..ప‌ల్లె వాతావ‌ర‌ణంలో న‌డిచే క‌థ ..బంగార్రాజు క‌థ..మామూలుగా కాదు ఓ స్థాయిలో ఉంది ఈ క‌థ.. అస‌లు సోగ్గాడే తోనే దుమ్ము దులిపాడు నాగ్.. ఈ సారి కొడుకుతో చాలా అంటే చాలా పోటీ ప‌డ్డారు. అంత‌కుమించిన స్థాయిలో క‌థ పై ప్రేమ పెంచుకున్నారు కూడా! ఎవ‌రు చెప్పారు నాగ్ కు వ‌య‌సు దాటిపోతుంద‌ని.ఏం కాదు ఈ సినిమా  చూడండి అంద‌మ‌యిన అమ్మాయిల‌కు ల‌డ్డుండ‌లు తినిపిస్త‌డు. ఈ సినిమా పాట‌లు మాత్ర‌మే కాదు డైలాగులు కూడా ఓ మోత మోగిస్తాయి..తూగో యాస‌లో డైలాగులు చాలా అంటే చాలా బాగా కుదిరాయి అని స్లాంగ్ మొత్తం డైరెక్ట‌ర్ కుర‌సాల క‌ల్యాణ్ కృష్ణ ద‌గ్గ‌రే నేర్చుకున్నాను ఇటీవ‌ల నాగ్ ఓ మీడియా మీట్ లో చెప్పారు.ఆ మాట‌ను నిజం చేస్తూనే ట్రైల‌ర్ ఉంది.



పండ‌గ లాంటి సినిమా..పండ‌గ‌కు వ‌చ్చేస్తందహో! ఇంకెందుకు ఆల‌స్యం థియేట‌ర్లకు పోదాం..ఇద్ద‌రు సోగ్గాళ్ల‌తో చిందులేసి,యాభై ఏళ్ల ద‌స‌రా బుల్లోడిని త‌ల్చుకుందాం..అవును! ఈ పండ‌క్కి ద‌స‌రా బుల్లోడు (ఎవ‌ర్ గ్రీన్ అక్కినేని న‌టించిన‌) కు యాభై ఏళ్లు..ఆ ఆనందంతో పాటు అక్కినేని అభిమానులు ఈ ఆనందం కూడా జ‌త!అంటే డ‌బుల్ థ‌మాకా అన్న మాట. డియ‌ర్ నాగ్, డియ‌ర్ చై ఆల్ ద బెస్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: