టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అపజయం లేని దర్శకుడు కొరటాల శివ. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలను చేసి విజయవంతం సాధించే దర్శకుడైన శివ తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుని సినిమాలు చేస్తూ ఇప్పుడు అగ్ర దర్శకుడి గా కొనసాగుతూ ఉన్నారు. ఏ దర్శకుడైనా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశాన్ని అతి తక్కువ కాలంలోనే అందుకున్నాడు కొరటాల శివ.

ఆయన దర్శకత్వంలో ఆచార్య సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో చేసిన ఈ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కొరటాల శివ ఏమని స్పందిస్తారో చూడాలి. 

విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతుంది చిత్ర బృందం. అలా రామ్ చరణ్ ఈ చిత్రం యొక్క విశేషాలను ఓ కార్యక్రమంలో చెబుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో తాను నటించాలనేది ముందు నుంచి లేదని ఎవరో ఒక ఫేమస్ యాక్టర్ ను ఈ చిత్రం లో చేయించాలని అనుకున్నామని కానీ కొరటాల శివ ఈ పాత్రలో తనను తప్ప వేరే వారిని ఊహించుకోలేదని చెప్పడంతో ఆయన బలవంతం చేయడం తో ఈ పాత్రలో తాను చేయక తప్పలేదని వెల్లడించారు రామ్ చరణ్. మరి ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ఆ రోజున ఈ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: