కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో శింబు కూడా ఒకరు. అగ్ర దర్శకుడు టి రాజేందర్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన శింబు తనదైన నటనతో అగ్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న ఈ హీరో ఇటీవల 'మానాడు' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. టైం లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఒక ప్రస్తుతం ఓటీటీ లోను సందడి చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శింబుకి ఒక అరుదైన గౌరవం దక్కింది. 

ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో సత్కరించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు హీరో శింబూ. డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులైన రాజేందర్, ఉషా కూడా హాజరవడం జరిగింది. ఇక డాక్టరేట్ అందుకున్న అనంతరం శింబు తల్లిదండ్రులు ముద్దాడారు. ఇక ఆ తర్వాత తను డాక్టరేట్ అందుకున్న ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. అంతేకాకుండా పలు ట్వీట్లు కూడా చేశాడు. వాటిని ఒకసారి గమనిస్తే.. ' నాకు ఇంతటి గౌరవాన్ని అందించినందుకు వేల్స్‌ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ఈ గౌరవాన్ని తమిళనాడుతో పాటు నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను. నా జీవితంలో సినిమా ఉందంటే దానికి కారణం వారే. అదేవిధంగా నన్ను ఎంతగానో ఆదరించిన అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అంటూ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం డాక్టరేట్ అందుకున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మానాడు సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శింబు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: