ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ లీడ్ రోల్ లో నటించిన హీరో సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరక్టర్ శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఓ విధంగా చెప్పాలంటే నిధి అగర్వాల్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు.

సంక్రాంతి బరిలో దిగుతున్న హీరో సినిమా ట్రైలర్ షాక్ ఇచ్చింది. శ్రీరాం ఆదిత్య విషయం ఉన్న డైరక్టరే అయినా గల్లా అశోక్ లాంటి హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏదో సినిమా చేస్తున్నాడు అనుకున్నారు కానీ ట్రైలర్ చూస్తే సినిమా లో మ్యాటర్ ఉన్నట్టే అనిపించింది. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా హీరో సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా కు మరో కలిసి వచ్చే అంశమే రన్ టైం. ఈమధ్య దాదాపు అన్ని సినిమాలు 2:45, 2:55 గంటల దాకా ఉంటున్నాయి. అయితే శ్రీరాం ఆదిత్య తెలివిగా ఈ సినిమాను చాలా క్రిస్పీగా సిద్ధం చేశాడట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం గల్లా అశోక్ హీరో సినిమా కేవలం 2 గంటల 10 నిమిషాల రన్ టైం తోనే వస్తుందని తెలుస్తుంది. ఈమధ్య కాలం లో ఇంత తక్కువ రన్ టైం తో ఏ సినిమా రాలేదని చెప్పొచ్చు. సంక్రాంతి బరిలో నాగార్జున, నాగ చైతన్య ల బంగార్రాజు.. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి రౌడీ బోయ్స్ సినిమాలు వస్తున్నాయి. ఆ రెండు సినిమాలకు పోటీగా అశోక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరోగా గల్లా అశోక్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంకరేజ్ మెంట్ దొరుకుతుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: