టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బ్రేక్ డాన్స్ ని, షేక్ డాన్స్ ని అన్ని రకాల డ్యాన్సులను పరిచయం చేసింది ఎవరు అంటే ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు టక్కున చెప్పేస్తారు  మెగాస్టార్ చిరంజీవి అని. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డాన్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించాడు. అప్పటివరకు డాన్స్ మాస్టర్లు చూపించిన స్టెప్పులను చేయడానికి హీరోలు ఇబ్బందిపడేవారు. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత సరికొత్తగా డాన్సులను కంపోజ్ చేయడానికి డాన్స్ మాస్టరు ఇబ్బంది పడ్డారు. అంతలా తన డాన్సులతో రఫ్ఫాడించే వాడు  మెగాస్టార్ చిరంజీవి. ఒకరకంగా చిరంజీవి మెగాస్టార్ కావడానికి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుని అంచెలంచెలుగా ఎదగాలడానికి ఆయన డాన్స్ కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎంతో అందంగా ఎంతో సొగసుగా గ్రేస్ తో డాన్స్ చేయడం చిరంజీవి కే సాధ్యమైంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ డాన్సర్ లుగా కొనసాగుతున్న అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్ళు మాకు డాన్స్ లో మెగాస్టార్ ఇన్సిపిరేషన్ అంటూ చెబుతూ ఉంటారు. ఇప్పటి యువ హీరోలు ఎంత డాన్సులు చేసిన అటు చిరంజీవి గ్రేస్ మాత్రం మ్యాచ్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అద్భుతంగా డాన్స్ చేసే చిరంజీవికి ఇలా డాన్స్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా.. జ్యోతిలక్ష్మి. ఆశ్చర్య పోతున్నారు కదా కానీ మీరు వింటున్నది నిజమే.



 అయితే ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సమయంలో  చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి శివశంకర వరప్రసాద్ గా హైస్కూల్ చదువులు చదువుతున్నప్పుడు జ్యోతిలక్ష్మి టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఆమె సినిమాలు చూస్తూ చిరంజీవి ఎంతగానో ప్రభావితం అయ్యారట. ఇక కాలేజీలకు వచ్చిన తర్వాత ఆమె సినిమాలు చూసి ఆమె చేసిన విధంగానే గదిలో డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడట చిరంజీవి. ఇలా జ్యోతిలక్ష్మి కి నేను ఏకలవ్య శిష్యుడిని అంటూ ఒకానొక సమయంలో చెప్పారు చిరంజీవి. ఇక ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రావడం తన అభిమాన నటి జ్యోతిలక్ష్మి తో నటించడం కూడా జరిగింది. అయితే ఇక ఇలా నటించినప్పుడు  నేను మీ ఏకలవ్య శిష్యుడిని అనే విషయాన్ని జ్యోతిలక్ష్మి కి చెప్పడంతో మొదట ఆశ్చర్యపోయిన ఆమె ఆ తర్వాత నవ్వుతూ ఆనంద పడిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: