టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు
ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇలా విడాకులు ప్రకటన తర్వాత ఎవరికి వారు సినీ కెరీర్లో బాగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత తాను ఎదుర్కొన్న టార్చర్ గురించి బయటపెట్టడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారిందట.

సుమంత ఈ సందర్భంగా తను ఎన్ని కష్టాలను అనుభవించిందనే విషయాలను కూడా బయటపెట్టారు. అయితే ఈమె బయటపెట్టిన ఆ విషయం పుష్ప సినిమాలో ఐటెం సాంగులో నటించడానికి పడిన కష్టం గురించి అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ పుష్ప సినిమాలో ఉ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మామ అనే పాట ఎంతటి సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎవరి నోట విన్నా కూడా ఎక్కడ చూసినా ఇదే పాటే వినిపిస్తుంది .సమంత మొట్టమొదటిసారిగా నటించిన ఐటెం సాంగ్ ఎంతో గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ పాట వెనుక సమంత ఎంత కష్ట పడిందో ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ఈ క్రమంలోనే ఈ పాట రిహార్సల్స్ సమయంలో కొరియోగ్రాఫర్ ఎంతో కఠినమైన స్టెప్పులు తనతో వేయిస్తూ చాలా టార్చర్ పెట్టారని తాజాగా ఈ విషయాన్ని సమంత బయటపెట్టారట..ఈ పాట రిహార్సల్స్ సమయంలోనే కొరియోగ్రాఫర్ తన ప్రాణాలు తీశాడని సమంత చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.సమంత ఈ పాట కోసం అంతగా కష్టపడింది కనుకే ప్రస్తుతం అందరిచేత ప్రశంసలు అందుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పవచ్చు. ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో సమంత బిజీ బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా సమంత నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: