అక్కినేని హీరోల్లో ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉంది ఎవరు అంటే నాగ చైతన్య అని చెబుతారు. లాస్ట్ ఇయర్ అఖిల్ హిట్టు ఖాతా తెరవగా నాగార్జున వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. కానీ నాగ చైతన్య మాత్రం అదరగొట్టేస్తున్నాడు. మజిలీ నుండి లవ్ స్టోరీ వరకు నాగ చైతన్య హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు బంగార్రాజు సినిమాలో అతని లుక్స్, స్టైల్ చూస్తుంటే చైతు ఈ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.

కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సోగ్గాడే చిన్ని నాయనా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు ప్రీక్వల్ గా బంగార్రాజు తెరకెక్కించారు. ఈ సినిమా కథ కోసం కళ్యాణ్ కృష్ణ చాలా కష్టపడ్డారు. మరోసారి సంక్రాంతి పండుగకి నాగార్జున, నాగ చైతన్య అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్  ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఓ విధంగా చెప్పాలంటే బంగార్రాజు సినిమా నాగ చైతన్య లీడ్ రోల్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున పాత్ర కన్నా నాగ చైతన్య పాత్ర ఫుల్ లెంగ్త్ గా ఉంటుంది.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా కథ నడుస్తుంది. సినిమాలో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తుంది. లేటెస్ట్ గా బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ అవగా అందులో కూడా నాగ చైతన్య తన స్టైల్ తో అందరిని అలరించాడు. సినిమా సినిమాకు నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాతో తప్పకుండా చైతు డబుల్ హ్యాట్రిక్  రంగం సిద్ధం చేస్తాడని చెప్పుకుంటున్నారు. చైతుకి జోడీగా కృతి శెట్టి కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. నాగార్జున, నాగ చైతన్య కలిసి సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. మరి బంగర్రాజు ప్రీ రిలీజ్ సందడి బాగుంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇదే జోరు ఉంటుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: