సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ' బంగార్రాజు' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయని తెలుస్తుంది.

2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకేక్కించారు ఆరేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన అయిన ఈసినిమా చాలా పెద్ద హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. దీంతో బంగార్రాజుపై కూడా అంచనాలు బాగా పెరిగాయి. మరో వైపు నాగచైతన్య మరియు నాగార్జున కలిసి నటిస్తుండటంతో.. ఫ్యాన్స్ కు పండగే నని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ప్రమోషన్లలో బాగా బిజీగా ఉంది బంగార్రాజు టీం. ఇప్పటికే అనూప్ రూబెన్స్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులు సమయమే ఉండటంతో త్వరత్వరగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోందట చిత్ర యూనిట్... ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం గత రాత్రి  మ్యూజికల్‌ నైట్స్‌ అనే ఈవెంట్‌ని కూడా నిర్వహించింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుందట.. మ్యూజిక్ గురించి అనూప్ రూబెన్స్ ను ప్రశంసిస్తుంటే సడెన్ గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్ దక్షనాగర్కర్ వైపు ఒరగా చూశాడు. దీంతో ఆ అమ్మడు కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్విందట. దీంతో చైతూ సిగ్గుపడిపోయాడని తెలుస్తుంది.. ఈ సీన్ మొత్తం కెమెరాల్లో రికార్డ్ కూడా అయింది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్ల తెగ వైరల్ గా మారింది. 'మెన్ విల్ బి మెన్ ' అంటూ నెటిజెన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక్కోసారి సెడెన్ ఇన్సిడెంట్లు కూడా క్యూట్ గా ఉంటాయని  కామెంట్లు పెడుతున్నారట.. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ మరియు కృతిశెట్టిలతో పాటు ఫరియా అబ్దుల్లా, మీనాక్షి దీక్షిత్,దర్శిని, వేదిక అలాగే దక్ష నగార్కర్, సిమ్రత్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: