అనుమప పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన అందం మరియు అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ భామ తాజాగా బాగా ట్రోలింగ్ కు గురవుతుంది. ఓ డెబ్యూ హీరోతో లిప్ లాక్ సీన్ లో నటించడంతో నెటిజన్లు ఆమె పై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

అయితే లిప్ లాక్ సీన్లంటే చాలామంది వెనకడుగు వేస్తారని అయితే అది కూడా స్టార్‌ హీరోతో అయితేనే కొంతమంది ఒప్పుకుంటారట.సాధారణంగా యంగ్‌ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్‌లాక్‌ సీన్‌ చేసేందుకు హీరోయిన్స్‌ అస్సలు ఒప్పుకోరు.
ఇలా అనుమప నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారిడితో లిప్ లాక్ చేయడంతో నెటిజెన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మలయాళం కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మించిన 'రౌడీ బాయ్స్' ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి అందరకు తెలిసిందే. ఆశిష్ రెడ్డికి ఇదే తొలి చిత్రం అనుపమ ఎన్నో సినిమాల్లో పద్ధతిగా కనిపించి మెప్పించింది.

కానీ ఈ సినిమాలో రెచ్చిపోయి నటించినట్లు టాక్ వినిపిస్తుంది.వ్యక్తిగత ఇమేజ్ లేకుండా.. రెమ్యూనరేషన్ కోసం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్‌ ఇచ్చేస్తావా అంటూ కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలని అగ్ర నిర్మాత కొడుకు అయినంత మాత్రానా కిస్ ఇచ్చేస్తారా అంటూ రెమ్యూనరేషన్ కోసం దిగజారి ప్రవర్తిస్తారా? అని అనుపమపై బాగా ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్‌ నెట్టింట విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి. ఆశిష్, అనుపమ మధ్య దాదాపు 3-4 కిస్సింగ్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది.

మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లలోకి రాబోతుంది. మరి సినిమా చూసిన తర్వాత ట్రోలర్లు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.ఇటీవల అనుపమకు మంచి హిట్ అస్సలు దొరకలేదు. ఈ సినిమా ద్వారా అయినా ఆమె మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తోందట.మరి ఆమె ఆశ నెరవేరుతుందో లేదో తెలియాలంటే పండుగ వరకు వేచి చూడాల్సిందే. గతంలో శ్యామ్ సింఘ రాయ్ ట్రైలర్‌లో నానితో కృతిశెట్టి లిప్-లాక్ సన్నివేశం కనిపించినప్పుడు కూడా చాలామంది నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేశారు. అంతే కాదు.. ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ కూడా చేశారు. పద్ధతిగా కనపడే కృతిశెట్టి ఇలా లిప్ లాక్ సీన్లలో నటించడంతో అభిమానులు అస్సలు జీర్ణంచుకోలేక పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: