పుష్ప పార్ట్ 1 తో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటిన డైరక్టర్ సుకుమార్ తన బర్త్ డే సందర్భంగా నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అంద్ ఫాలోవర్స్.. సెలబ్రిటీస్ నుండి బర్త్ డే విషెస్ అందుకుంటున్నాడు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఈ రేంజ్ లో హిట్ అయ్యింది కాబట్టి పార్ట్ 2 ని ఓ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. అయితే పుష్ప పార్ట్ 2 తర్వాత సుకుమార్ రంగస్థలం కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. పుష్ప 2 తర్వాత చరణ్ తో సుకుమార్ సినిమా అని గట్టిగా ఫిక్స్ అయ్యారు

సుకుమార్ బర్త్ డే కి విష్ చేసిన విజయ్ దేవరకొండ సుకుమార్ నెక్స్ట్ సినిమా హీరో తనే అని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశాడు. 2021 ది రైజ్.. 2022 ది రూల్.. 2023 రాంపేజ్ అంటూ తన సినిమా ఎనౌన్స్ మెంట్ చెప్పకనే చెప్పాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం రౌడీ బోయ్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే పుష్ప 2 పూర్తి చేసే సరికి శివ నిర్వాణ సినిమా ముగించేసి సుకుమార్ తోనే విజయ్ సినిమా చేస్తాడని అంటున్నారు.

లైగర్ తో ఎలాగు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సుక్కుతో చేసే సినిమా కూడా తప్పకుండా నేషనల్ వైడ్ గానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లైగర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం విజయ్ ఇక వరుస తన సినిమాలన్ని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తారని టాక్. సుక్కుతో విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా వస్తుందో అని ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: