తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాల నుంచి విమర్శల వరకూ అన్నీ దగ్గరుండే చేసే వ్యక్తి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఈయన సినిమాల కన్నా కూడా వివాదాలే ఎక్కువ పాపులర్ అవుతూన్నాయి. ఈయన సోషల్ మీడియా వేదికగా ఆయన అనాలనుకున్నది అనెస్తూ ఉంటాడు. ఇటీవల అన్ని కాంట్రవర్షియల్‌ సబ్జెట్‌లతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ బండిని లాగిస్తున్నారు.ఎంతటి సీరియస్‌ విషయాన్నైనా సెటైరికల్‌ గా, కామెడీగా రెస్పాండ్‌ అయ్యే వర్మ.. ఆంధ్రప్రదేశ్‌ లో టికెట్ల రేట్ల విషయం లో మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

 

నిజం చెప్పాలంటే మరే సినిమా వ్యక్తులు కూడా ఈ స్థాయి లో స్పందించలేదు. ఇది నిజంగా వర్మ గట్స్ అనే చెప్పాలి.చెప్పాలంటే టికెట్ల రేట్ల ఇష్యూని ఇప్పుడు ఆయన తన పర్సనల్‌గా తీసుకున్నట్టు గా ఉంది. అంతేకాదు ఇండస్ట్రీ తరపున వాధిస్తున్న ఒకే ఒక్కడుగా ఉన్నారు. సోషల్ మీడియా లో వరుస పోస్ట్ లు చెస్తున్నారు. ఛాన్స్ దొరికిన దారిలో తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టడంతో పాటు తికమక చేస్తున్నాడు. ఊపిరి ఆడకుండా చేస్తున్నారు.


గత కొన్ని రోజులుగా వర్మకు, ఎపి సర్కార్ కు మధ్య టిక్కెట్ ల విషయం పై కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర లో గరిష్టంగా పెద్ద సినిమాలకు 2200 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ ఏపీలో కనీసం 200కూడా అనుమతించక పోతే వివక్ష ను నిషేధించే ఆర్టికల్‌ 14ని నేరుగా ఉల్లంఘించినట్టు కాదా? . కోవిడ్‌ సమయంలోనూ మహారాష్ట్రలో ఇప్పటికే 24 గంటలు థియేటర్లని నడపడానికి ప్రభుత్వం అనుమతించింది. రాత్రి, పగలు లో ఎన్ని షోలు వేసినా జరిగే హాని ఏంటీ? అని ప్రశ్నించారు వర్మ. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం కూడా సంపాదించుకోవచ్చు..అని ప్రశ్నల వర్షం కురిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: