టాలీవుడ్ లో పాతుకు పోయిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడ నేషనల్ క్రాష్ గా మారి పోయింది. ఇటు తెలుగులో వరుస చిత్రాలు చేస్తూనే...తమిళ్, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీతో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ లైఫ్ స్టైల్ కు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
ముందుగా చెప్పాలంటే ప్రస్తుతం రూ. 1.75 నుండి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను పుచ్చుకుంటున్న ఈ భామ ఇపుడు తన పారితోషికాన్ని ఏకంగా మూడు కోట్లకు పెంచేసినట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు  గుండెల్లో పరుగులు తీస్తున్న ఈ అందాల తార సినిమా ల్లోనే కాదు నిజ జీవితం లోనూ చాలా సరదాగా అల్లరి చేస్తూ ఉంటుందట. మనసుకు ఏమి అనిపిస్తే అది కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తుందట. ఈ గుణమే కొన్నిసార్లు తనని అందరి మన్నలను పొందేలా చేసిందని అంటుంటారు. ఈ ముద్దు గుమ్మ 1996, ఏప్రిల్ 5 న కర్ణాటకలో జన్మించారు.

రష్మిక మందన్నకు గతంలో ఒక యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నారు.  2017, జూలై 3 న రక్షిత్ శెట్టితో నిశ్చితార్దం కాగా ఆ తర్వాత నిశ్చితార్దంను క్యాన్సిల్ చేసుకున్నారు. ఒకవేళ ఆ పెళ్లి కనుక జరిగి ఉంటే ఈ బ్యూటీని టాలీవుడ్ ఇండస్ట్రీ మిస్స్ అయ్యుండేది. అలా జరగక పోవడం మనమంచికే అనుకోవాలి అంటుంటారు ఆమె ఫ్యాన్స్. ఇప్పుడు తన సక్సెస్ ను చూస్తున్న వాళ్ళు, రష్మిక లైఫ్ లో ఇదే టర్నింగ్ పాయింట్ అని కితాబిస్తున్నారు. మరి ఇక ముందు కూడా ఇదే జోరును కొనసాగిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: