తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చిరుత' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే హీరోగా తన సత్తా చాటిన రామ్ చరణ్.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. తక్కువ సినిమాలతోనే ఇండస్ట్రీలో హీరోగా సత్తా చాటాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ నటించింది కేవలం 14 సినిమాలే అయినప్పటికీ వాటిలో చాలావరకు విజయాలే ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ సినిమాలో నటించాడు రామ్ చరణ్. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ తో మన సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఇక ఇదిలా ఇలా ఉంటే రామ్ చరణ్ చిరుత సినిమాలో తనతో కలిసి నటించిన నేహా శర్మతో ఎఫైర్ పెట్టుకున్నాడని అప్పట్లో వార్తలు తెగ వినిపించాయి. అంతేకాదు చిరుత సినిమా తర్వాత ఏకంగా ఈ ఇద్దరు కలిసి రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.

ఇక ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ విషయంపై వివరణ ఇచ్చాడు.' సినిమా ఇండస్ట్రీ లో మొదటిసారి రూమర్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలిసి వచ్చింది. ఇక నా గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం, నువ్వు ఏమి పట్టించుకోకు అని అమ్మ నాన్న చెప్పారు. నా స్నేహితులు కూడా ఇవన్నీ లైట్ తీసుకో అని అన్నారు. ఉపాసన కూడా ఈ విషయంలో నాకు సపోర్ట్ చేయడంతో ఆ రోజుతో సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రూమర్స్ వచ్చినా సరే ధైర్యంగా నిలదొక్కుకోగలిగాను' అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. అయితే అప్పట్లో రామ్ చరణ్, నేహా శర్మ ఇద్దరికి సంబంధించిన వార్తలు మాత్రం ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: