సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో, హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఇండ్రస్టీకి చెందిన వాళ్ళను పెళ్లి చేసుకుంటే... మరి కొందరు బయటి వాళ్ళను కూడా వివాహం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మరికొంతమంది హీరోయిన్లు క్రికెటర్ తో ఎఫైర్ పెట్టుకొని ప్రస్తుతం వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆ క్రికెట్ మాత్రం వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇక ఇప్పటివరకు ఎవరెవరు క్రికెటర్ మన హీరోయిన్స్ తో ఎఫైర్లు పెట్టుకున్నారో ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం...

ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో లో సెక్సీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ జీనత్ అమన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని డేటింగ్ కూడా చేసిన విషయం అందరికి తెలిసిందే..

రవి శాస్త్రి

ఇండియన్ క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్ చేసిన రవిశాస్త్రి గ్రౌండ్ లోనే కాదు బయట కూడా చాలా ఆక్టివ్ గా ఉంటాడు. ఇకపోతే ఈయన కూడా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమృతా సింగ్ తో చాలా కాలం ఎఫైర్ నడిపాడు..

అజారుద్దీన్

హైదరాబాద్ బెస్ట్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న అజారుద్దీన్ సంగీత బిజీలాని అయితే అప్పట్లో ఎఫైర్ నడిపాడు. అయితే కొద్ది రోజులు ఈమెతో ఎఫైర్ నడిపిన అప్పటికీ చివరికి ఈమెనే పెళ్లి చేసుకున్నాడు..

యువరాజ్ సింగ్, ధోని

ఇండియన్ బెస్ట్ క్రికెటర్ గా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్, ధోనీ లతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే అప్పట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపింది. కానీ చివరికి వీరిద్దరూ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు.

విరాట్ కోహ్లీ

ఇక ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన రొమాంటిక్ తమన్నా తో పాటు మరి కొంత మంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపాడు. కానీ చివరికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ఎఫైర్ నడిపి ఆమెను పెళ్లి చేసుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: