మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. సక్సెస్ మరియు ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుని టాలీవుడ్ హీరోగా సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగిపోతున్నాడు..

ఆర్ఆర్ఆర్' ఫిల్మ్ తర్వాత చెర్రీ పాన్ ఇండియా స్టార్ అయిపోతారనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇకపోతే ఆయన లైనప్ మూవీస్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం గమనార్హం.. ఈ సంగతులు ఇలా ఉంచితే.. తాజాగా చరణ్‌కు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ క్రేజీ ఆఫర్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూన్నాయి.

ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే..ఇంతకీ ఆయన ఎవరంటే..రామ్ చరణ్ తేజ్ లైనప్ మూవీస్‌లో ఇండియన్ జీనియస్ డైరెక్టర్ అయిన శంకర్ మూవీ 'ఆర్ సీ 15' ఉండగా ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో స్పోర్ట్స్ డ్రామ్ కూడా ఉంది. కాగా, ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి నెట్టింట న్యూస్ హల్ చల్ అవుతున్నాయి. ఆ వార్తల ప్రకారం..తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' ఫిల్మ్‌తో సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ టైమ్ ట్రావెల్ కథతో ఓ సినిమా తెరకెక్కించేందుకు స్టోరీ కూడా రెడీ చేసుకున్నాడని సమాచారం.ఈ స్టోరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం రాసుకున్నాడని సమాచారం.

స్టోరి కంప్లీట్ అయ్యాక చరణ్‌కు వినిపించి కన్విన్స్ చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం.రాజమౌళి 'మగధీర' మూవీని మించి ఈ పిక్చర్ ఉండబోతుందని రాహుల్ సాంకృత్యన్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారని సమాచారం.. అంతలా ఈ స్టోరిలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయి అబ్బా.ఇంతకీ స్టోరి ఎక్కడి వరకు వచ్చింది? ఇదంతా నిజమేనా? అనే విషయాలు తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. రాహుల్ సాంకృత్యన్ ప్రజెంట్ 'శ్యామ్ సింగరాయ్' ఫిల్మ్ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కూడా చూసి ప్రశంసలు కురిపించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: