ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన హిట్ కొట్టిన కృతి శెట్టి తన సెకండ్ సినిమా శ్యాం సింగ రాయ్ తో కూడా సెకండ్ సక్సెస్ అందుకుంది. ఇక కృతి శెట్టి థర్డ్ మూవీ బంగార్రాజు ఈ సంక్రాంతికి వస్తుంది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. సినిమా చేయడమే కాదు ప్రమోషన్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది అమ్మడు.

ఇక ఇదిలాఉంటే ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి శెట్టి ముద్దు పేరు ఏంటో తెలుసా.. బుంది.. కొద్దిగా విచిత్రంగా ఉన్నా ఆమె ముద్దు పేరు అదే. లేటెస్ట్ గా బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో కృతి శెట్టి ఆలితో సరదాగా షోలో పాల్గొంది. ఈ షోలో కృతి శెట్టికి సంబందించిన రెండు ముద్దు పేర్లని అలి రివీల్ చేయడం విశేషం. అయితే అవి మీకెలా తెలుసని కృతి శెట్టి కూడా షాక్ అయ్యింది.

అంతేకాదు కృతి శెట్టి మోడల్ గా ఉన్నప్పుడు దాదాపు 20 ప్రొడక్ట్స్ లో నటించిందట. తన మొదటి ప్రొడక్ట్ బిస్కెట్స్ అని.. ఆ ప్రకటనతోనే తాను పాపులర్ అయ్యానని అన్నది కృతి శెట్టి. ఇక ఉప్పెన సినిమా చూసి ఓ స్టార్ హీరో నీకు పర్సనల్ గా లెటర్ రాసి.. బొకే కూడా పంపించాడట అతనెవరు అని అడిగారు అలి. అలితో సరదాగా లేటెస్ట్ ప్రోమో అలరించింది. కృతి శెట్టితో అలి జరిపిన ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. తప్పకుండా కృతి ఫ్యాన్స్ ని ఈ ఇంటర్వ్యూ అలరిస్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: