అందాల ముద్దుగుమ్మ రీతు వర్మ, విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో రీతు వర్మ కు ఫుల్ క్రేజ్ దక్కింది. ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ టక్ జగదీశ్, వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.

 ఈ సినిమాలలో టక్ జగదీశ్ సినిమా నేరుగా ఓటిటి లో విడుదల కాగా, వరుడు కావలెను సినిమా సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. అలాగే ప్రస్తుతం రీతు వర్మ, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా రీతూ వర్మ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రీతూ వర్మ మంచు ప్రదేశం లో నిలబడి ఫోటోకు స్టీల్ ఇచ్చింది. ఈ ఫోటోకి రీతూవర్మ వింటర్ వండర్లాండ్ అనే క్యాప్షన్ జత చేసింది.  ఇలా రీతు వర్మ శీతాకాలంలో  మంచు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: