అందాల ముద్దుగుమ్మ రకుల్  ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా తెలుగులో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 

కాకపోతే ప్రస్తుతం మాత్రం హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో కొంచెం స్లో అయిందనే చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన చివరి రెండు సినిమాలు అయిన చెక్, కొండాపొలం రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కు జిమ్  అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే. తన ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడుతుందో కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తాను జిమ్ లో ఎలా కష్టపడుతున్నాను అనే దానిని తెలియజేస్తూ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇలా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లో కష్టపడుతున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: