అందాల ముద్దుగుమ్మ నభా నటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ కూడా దక్కలేదు. ఆ తర్వాత డిస్కో రాజా సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో బాక్సాఫీసు దగ్గర విజయం దక్కక పోయినప్పటికీ మంచి క్రేజ్ మాత్రం దక్కింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్న నభా నటేష్ ఈ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.  అందులో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందచందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో నభా నటేష్ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే  లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టీల్ ఇచ్చింది.  ఇప్పటికి కూడా నబా నాటేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: