ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేసిన రాధాకృష్ణసినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చిట్ చాట్ చేశాడు. సంక్రాంతికి రావాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులని కదిలించిన రాధాకృష్ణ వారిలో కొద్దిగా జోష్ నింపాలని ప్రయత్నించాడు. ఇక ఇదిలాఉంటే ఈ చిట్ చాట్ లో ప్రభాస్ అభిమాని ఒకరు రాధాకృష్ణకి షాక్ ఇచ్చాడు. అన్న నువ్వు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని అని కామెంట్ పెట్టాడు.

అయితే దానికి రాధాకృష్ణ రిప్లై ఇస్తూ ఇలా బెదిరిస్తే వచ్చి మరి నీ బమ్స్ మీద కొడతా అని ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ డైరక్టర్ నుండి తనకు రిప్లై రావడం కోసం సూసైడ్ చేసుకుంటాననే రేంజ్ లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసినా ఎప్పుడొచ్చినా సరే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవల్ అని చెబుతున్నాడు డైరక్టర్ రాధాకృష్ణ. జిల్ తో తన ప్రతిభ చూపించిన రాధాకృష్ణ రాధే శ్యామ్ సినిమాను ఓ అద్భుతమైన సినిమాగా తీర్చిదిద్దారు.

సినిమాలో ప్రతి ఫ్రేం సినిమా నిర్మాతలు పెట్టిన ఖర్చుకి ఆవిష్కరించబడుతుందని అంటున్నారు. ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతందని చెబుతున్నారు. రాధే శ్యామ్ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడ్డది. సినిమాలో గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అందరు మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుందని టాక్. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా చాలా స్పెషల్ గా ఉండగా థమన్ ఈ సినిమాకు బిజిఎం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: