సంక్రాంతి రేస్ కు విదుదలకాబోతున్న ‘బంగార్రాజు’ మూవీని ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురౌతున్నప్పటికీ నాగార్జున పట్టువదలకుండా ప్రమోట్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ అమలు జరగడంతోపాటు 50శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు మళ్ళీ అమలులోకి రావడంతో ఈ మూవీని కొనుక్కున్న ఆంధ్రా ప్రాంతపు బయ్యర్లు బాగా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇప్పటివరకు ఈ సినిమాని ‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీకి సీక్వెల్ గా అందరు భావిస్తూ వచ్చారు. అయితే ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఈ మూవీలో అసలు బంగార్రాజు వేరుగా ఉన్నాడు అంటూ లీకులు ఇవ్వడంతో ఈ మూవీలో ఈ సస్పెన్స్ ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


మూవీ కథను తయారుచేయడానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు 5 సంవత్సరాలు పడితే ఈ మూవీని కేవలం 5 నెలలలో పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈమూవీ ప్రస్తుతం కొనసాగుతున్న వ్యతిరేక పరిస్థితులను కూడ లెక్కచేయకుండా సంక్రాంతికి విడుదల అవుతున్న పరిస్థితులలో అసలు ఈ మూవీ పై నాగార్జునకు ఉన్న ఆత్మవిశ్వాసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. టాప్ హీరోలు అందరూ తమ సినిమాలను వాయిదా వేస్తే ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నా ఆంధ్రా ప్రాంతంలో టిక్కెట్ల రేట్లు వివాదం కొనసాగుతున్నా ఈవిషయాలు తనకు ఏమి సంబంధం లేదు అంటూ నాగ్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు.


ప్రస్తుతం నాగార్జున సినిమాలకు మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే లవ్ స్టోరీ సూపర్ సక్సస్ తో నాగచైతన్య మంచి జోష్ లో ఉన్నాడు. దీనితో ఈ తండ్రి కొడుకుల మ్యాజిక్ ఎంతవరకు ఈమూవీని రక్షిస్తుంది అన్నది సంక్రాంతిరోజున తేలిపోతోంది. ఈసినిమాకు పోటీగా చిన్న సినిమాలు మాత్రమే మిగలడం ఈసినిమా పై భారీ అంచనాలు ఉండటంతోపాటు తెలంగాణాలో టిక్కెట్ల రేట్ల పెంపుదల బాగా ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణతో తాను గట్టేక్కుతాను అన్న గట్టి నమ్మకం పై నాగార్జున ఉన్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: