టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇటీవలే విడుదల కాగా దీనికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది ప్రేక్షకుల దగ్గరనుంచి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ అమ్మ పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. 

హాలీవుడ్ నటుడు, బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండడం ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొనడానికి ముఖ్య కారణం. అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండకు హిట్ పడాల్సిన ముఖ్యమైన సినిమాగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన టాక్సీ వాలా చిత్రం తర్వాత ఆ స్థాయిలో హిట్ దక్కలేదనే చెప్పాలి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ప్రేక్షకులను ఏ మాత్రం మేప్పించకపోవడంతో ఈ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తో ఎలాగైనా విజయం సాధించి విజయ్ దేవరకొండ తన సక్సెస్ ను కంటిన్యు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సినిమా పట్ల తాను ఎంతగా కసి గా కనపడుతున్నాడో ఈ చిత్రం యొక్క గ్లింప్స్ ను బట్టి తెలుసుకోవచ్చు. ఎంతో ప్రామిసింగ్ లుక్ లో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై ప్రాణం పెట్టి పని చేస్తున్నారని ఇప్పటికే నేరుగా ప్రేక్షకులకు వెల్లడించగా ఆయన చెప్పినట్లుగానే తెరపైన కూడా ఆయన ఎంతో కసితో కనబడుతూ ఈ చిత్రం పై భారీ అంచనాలను పెంచుతున్నాడు. ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆ రోజున ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పాన్ ఇండియా మార్కెట్లోకి తొలిసారిగా అడుగుపెడుతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సెన్సేషన్ సృష్టిస్తాడు అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: