ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు, అటు రాజకీయాలలో, మరొకవైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా అడుగుపెట్టాడు. అందులో యాంకర్ గా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఆ షోని బాగా హైప్ చేశాడు బాలయ్య. బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా ఈ షోలో నటించడం గమనార్హం. అంతే కాకుండా బాలయ్య వల్ల ఈ షో పెద్ద హిట్ అయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరొకసారి అరుదైన ఘనతను సాధించాడు బాలయ్య.

బాలయ్య ఈ షోలో సరికొత్త కోణాన్ని ఆయన అభిమానులు బాగా ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికీ ఈషోని హక్కులు కొనేందుకు పలు టీవీ ఛానల్స్ కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారట.. బాలకృష్ణ ఈషోలో చేసేందుకు చాలా కష్టపడ్డట్లుగా సమాచారం. ఈషోతో బాలకృష్ణ ఎంతోమంది ఆడియన్స్ ను తన వైపు తిప్పుకునే ఎలా చేసుకున్నాడు. దీంతో ఆయన బాగా సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. IMDB టాక్ షో లో నిర్వహించిన ఒక సర్వేలో..9.7 రేటింగ్ ను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో కపిల్ శర్మ చేస్తున్న దీ కపిల్ శర్మ షో నిలిచింది. ఇక ఆ తరువాత స్థానం ఐశ్వర్యరాయ్ అమెజాన్ ఫ్యాషన్. పదవ స్థానంలో నిలిచింది.

మొత్తం అన్ని సిరీస్ లను కలుపుకొని సెలెక్ట్ చేస్తే అందులో బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ షో నే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం .I MBD సంస్థ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు, టీవీ షో లో ప్రసారమయ్యే టాక్ షో వంటి వాటిని కూడా రేటింగ్ ఇస్తూ ఉంటుంది. కేవలం ఈ క్రెడిట్ అంతా బాలకృష్ణకి దక్కుతుందని పలువురు తెలియజేయడం జరిగింది. బాలయ్య ఈ వయసులో కూడా అంతలా మెప్పిస్తాడు అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: