నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న బంగర్రాజు సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ 100 K లైక్స్ తో సంచలనం సృష్టించింది. అక్కినేని ఫ్యాన్స్ కు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు కొనసాగింపుగా ఆ కథకి ప్రీక్వల్ గా బంగార్రాజు వస్తుంది. సినిమాలో నాగార్జున తరహా యాటిట్యూడ్ తో నాగ చైతన్య ఇంప్రెస్ చేస్తాడని అర్ధమవుతుంది.

నాగ చైతన్య ఇన్నాళ్లు చాలా కూల్ గా.. సైలెంట్ రోల్స్ చేశాడు. కెరియర్ లో మొదటిసారి మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు అదరగొట్టేయడం ఖాయమని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ సూపర్ వ్యూస్ తో పాటుగా లైక్స్ కూడా తెచ్చుకుంటుంది. లక్షల్ లైకులతో బంగర్రాజు సినిమా ప్రేక్షకులను ఎంతగా రీచ్ అయ్యిందో తెలుపుతున్నారు. బంగర్రాజు పక్కా సంక్రాంతి మూవీగా ఆడియెన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసేలా వస్తుంది.

సినిమాలో కామెడీ.. ఎమోషన్స్.. యాక్షన్.. ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. సినిమా బజ్ చూస్తుంటే 2016లో సోగ్గాడే చిన్ని నాయనా హిట్ రిపీట్ చేసేలా ఉన్నారు అక్కినేని హీరోలు. ఈమధ్య నాగ చైతన్య వరుస సినిమాల హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ సినిమా కూడా అదే వరుసలో నిలబెడతాడేమో చూడాలి. సినిమాలో కృతి శెట్టి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అవనుంది. ఆమె చేసిన ఉప్పెన, శ్యాం సింగ రాయ్ హిట్ అవడంతో బంగార్రాజుకి అది కలిసి వచ్చింది. సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ కూడా నటించింది. అయితే కృతి శెట్టినే సోలో హీరోయిన్ గా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. చైతు, కృతి శెట్టి రొమాన్స్ సినిమాకు హైలెట్ అని అంటున్నారు.  


 


మరింత సమాచారం తెలుసుకోండి: