సంక్రాంతి పండుగకు రాబోతున్న ‘బంగార్రాజు’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈసినిమాకు పోటీగా మరో భారీ సినిమా లేకపోవడంతో ఈమూవీ బయ్యర్లు భారీ కలక్షన్స్ పై ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకకటించిన నైట్ కర్ఫ్యూ సంక్రాంతి తరువాత మాత్రమే అమలులోకి వస్తుందని ప్రకటించడంతో పరోక్షంగా ఈ మూవీకి ఆ ప్రకటన ఉపకారం చేసినట్లు అయింది.


కరోనా పరిస్థితులు అందరికీ భయాన్ని కలిగిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న నేపధ్యంలో ఈమూవీకి భారీ కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఈమూవీ సెన్సార్ కాపీని చూసిన కొంతమంది చెపుతున్న మాటల ప్రకారం ఈమూవీ కథలో చైతన్య డామినేషన్ చాల ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.


ఈమూవీ టైటిల్ రీత్యా నాగార్జున హీరో అయినప్పటికీ కథ అంతా చైతన్య చుట్టూ తిరగడంతో ఈమూవీ చూసినవారికి నాగార్జున పాత్ర కేవలం అతిధి పాత్రగానే కనిపిస్తుంది అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈమూవీ కృతి శెట్టికి మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని సర్పంచ్ గా ఆమె నటన అందరికీ నచ్చే విధంగా డిజైన్ చేసారు అని తెలుస్తోంది. ఈమూవీ కథలో ‘బంగార్రాజు’ పాత్రలో కనిపించే నాగార్జున నట విశ్వరూపం ఈమూవీ హైలెట్ అంటున్నారు.


‘సోగ్గాడే చిన్నినాయ‌న’ మూవీ కథలో లా నాగార్జున స్వర్గం నుండి భూలోకానికి వచ్చి తన మనవడి సమస్యలను పరిష్కరించే పాత్రలో కనిపించబోతున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయ‌న’ లో కొడుకు కాపురాన్ని చ‌క్క‌దిద్ది అత‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే పాత్ర‌లో క‌నిపిస్తే ఈమూవీలో నాగార్జున తన మనవడికి సహాయం చేసే పాత్రలో చాల ఎనర్జిటిక్ గా నటించాడు అని తెలుస్తోంది. నాగార్జున వయసు 62 సంవత్సరాలు దాటిపోయినా ఎక్కడా తన స్పీడ్ ను తగ్గించుకోకుండా ఇప్పటికీ తాను వెండితెర మన్మధుడు ని అని తెలుగు ప్రజలకు మరొకసారి తెలియచేసేలా నాగ్ పాత్ర ఈమూవీలో చాల తెలివిగా డిజైన్ చేసుకున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: