చిత్ర పరిశ్రమకి ఎంతో మంది హీరోయిన్స్ వారి అదృష్టాన్ని పరీక్షించుకొని వెళ్తుంటారు. కొందరికి మూడు, నాలుగు సినిమాలోతో స్టార్ హీరోయిన్ హోదా వస్తే.. మరికొందరికి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి ఒక్కరు. ఆమె ఉప్పెన, శ్యాం సింగ రాయ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు కొట్టిన మంగుళూరు భామ కృతి శెట్టి ఈ పొంగల్ కి బంగార్రాజుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బంగార్రాజు సినిమాలో నాగార్జున్, నాగ చైతన్య కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటుగా కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కూడా కృతి శెట్టి జోరుగా పాల్గొంటున్నారు. ఇక ఇదిలాఉంటే ఈ క్రమంలో లేటెస్ట్ గా అమ్మడు అలితో సరదాగా షోకి బంగార్రాజు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి వచ్చింది.

ఎంతో మంది నటులను తీసుకొచ్చి వారి జీవిత రహస్యాలను, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలను అన్నిటిని ప్రజలకు తెలిసేలా చేస్తుంది ఈ షో. అయితే ఈ షోలో భాగంగా అలి కృతి శెట్టి ముద్దు పేరు అందరికి చెప్పుకొచ్చారు. ఇక కృతి శెట్టి ముద్దు పేరు బుంగి అనగానే అమ్మడు షాక్ కి గురైంది. వెంటనే మీకు ఎలా తెలుసు అంటూ అలీని అడిగింది. అందుకు అలీ ఇదే కాదు ఇంకో ముద్దు పేరు కూడా ఉందని అంటాడు.

అయితే ఉప్పెన హిట్ తో బార్న్ స్టార్ దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నావు ఎవరతను అని అలి అడిగారు. అలాగే ఇదివరకు కృతి శెట్టి చేసిన యాడ్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే మొత్తానికి అలి ప్రోమోతోనే కృతి శెట్టితో సందడి షురూ చేశారు. అకాగ్.. షో మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: