టాప్ హీరోలలో వెంకటేష్ తీరు చాలవిభిన్నం. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఖాళీగా ఉన్న సమయంలో ఆధ్యాత్మిక గ్రంధాలు ఎక్కువగా చదివే వెంకటేష్ ఇప్పటివరకు చాలామంది హీరోలు లా పెద్దపెద్ద వ్యాపారాలలోకి ఎంటర్ కాలేదు.



అయితే ఇప్పుడు వెంకీ ఎవరు ఊహించని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు సందడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఎలట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ల వ్యాపారంలో అగ్రగామిగా నిలుస్తున్న ‘బైక్ వో’ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వెంకటేష్ తన సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆ సంస్థలో పెట్టుబడులు కూడ పెట్టాడని అంటున్నారు.



రానున్న రోజులలో ఎలట్రిక్ వాహనాల హవా కొనసాగుతుందని ఇప్పటికే అంచనాలు వస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాలు తరువాత దేశంలో లక్షల సంఖ్యలో ఎలట్రిక్ కార్లు మోటార్ సైకిల్స్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల వీధులలో కనిపించే ఆస్కారం ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఎలట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టినప్పటికీ వీటికి చార్జింగ్ స్టేషన్ ల కొరత వల్ల చాలామంది ఇలాంటి వాహనాలను కొనడానికి ముందుకు రావడంలేదు.



అయితే పెట్రోల్ బంక్స్ లా ఎక్కడ పడితే అక్కడ ఎలట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ లు అందుబాటులోకి వస్తే చాలామంది ఎలట్రిక్ వాహనాల వైపు ముందడుగు వేసే ఆస్కారం ఉంది. దీనికితోడు కేంద్రప్రభుత్వం కూడ ఈ ఎలట్రిక్ వాహనాల పరిశ్రమకు బాగా ప్రోత్సాహాలు అందిస్తున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో వెంకటేష్ ఈ చార్జింగ్ స్టేషన్ ల ఫ్రాంచేజీ లకు అందించే ప్రచారంతో ఈ పరిశ్రమ తెలుగు రాష్ట్రాలలో ఎంతవరకు అభివృద్ధి చెందగలదో చూడాలి. ఇప్పటికే చిరంజీవి నాగార్జున మహేష్ రామ్ చరణ్ లు తమ డబ్బును వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడ వ్యాపార రంగంలోకి ఎంటర్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..  




మరింత సమాచారం తెలుసుకోండి: