చెన్నై చిన్నది మేఘా ఆకాష్ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అందం, అభినయం ఉన్నా సరే ఆమె ఎందుకో సరైన క్రేజ్ దక్కించుకోలేదని చెప్పొచ్చు. తమిళంలో మేఘా ఆకాష్ చేసిన మొదటి సినిమా ఒరు పక్క కథై సినిమా రిలీజ్ సంక్షోభంలో చాలా ఏళ్లు ఆగిపోయింది. ఫైనల్ గా జీ 5లో అది రిలీజ్ చేశారు. మొదటి సినిమానే అలా అయ్యేసరికి మేఘా కెరియర్ మీద బ్యాడ్ రిమార్క్ పడ్డది. అయితే ఆ సినిమా ప్రచార చిత్రాలతో తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాలో చాన్స్ అందుకుంది. నితిన్, మేఘా జోడీ బాగుండటంతో మళ్లీ నితిన్ తోనే ఛల్ మోహన్ రంగ సినిమా కూడా చేసింది మేఘా ఆకాష్.

మేఘా ఆకాష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే.. ఆమె తండ్రి తెలుగు వాడే.. మదర్ మళయాళి. ఇద్దరు కలిసి చెన్నైలో సెటిల్ అయ్యారు. మేఘా ఆకాష్ తమిళ అమ్మాయి అంటారు కానీ ఆమె మదర్ టంగ్ మళయాళం. అంతేకాదు మేఘా ఆకాష్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు అడ్వర్టైసింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. మేఘా ఆకాష్ తెలుగులో ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. లాస్ట్ ఇయర్ రాజ రాజ చోర, డియర్ మేఘా సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ ఆ సినిమాలతో ఓ మోస్తారు క్రేజ్ తెచ్చుకుంది.

మేఘా ఆకాష్ ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇదే సినిమాలో తమన్నా లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. మేఘా ఆకాష్ కేవలం హీరోయిన్ గానే కాదు తనకు వచ్చిన ప్రతి పాత్ర చేస్తూ వచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాలో కూడా ఆమె నటించింది. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి హీరోయిన్ గా టర్న్ తీసుకున్న మేఘా ఆకాష్ కెరియర్ లో ఓ సెన్సేషనల్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. అందం.. అభినయం ఉన్న ఈ అమ్మడికి అలాంటి ఓ సూపర్ హిట్ రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: