తెలుగులో మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి కానీ మంచి కథాబలం ఉన్న సినిమా మంచి స్క్రీన్ ప్లే ఉన్న సినిమా మంచి డైలాగులు ఉన్న సినిమా కథ కోసమే పుట్టింది అనే విధమైన సినిమాలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రస్తుత భవిష్యత్తు మీద కథలు చాలా తక్కువగా వస్తున్నాయి అని చెప్పవచ్చు. ఆదిత్య 369 లాంటి సినిమాలు నిర్మించిన సినిమా పరిశ్రమలో ఇప్పుడు అలాంటి కథ లు ఉన్న సినిమా లు తగ్గిపోవడం ఒక్కసారిగా తెలుగు సినిమా అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

ఆ విధంగా ఇటీవలే తమిళనాట రూపొందించిన ఓ సినిమా అక్కడ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలబడింది. అయితే తెలుగులో ది లూప్ పేరుతో విడుదల అయ్యేందుకు సిద్ధం కాగా ఆఖరి నిమిషంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ చిత్ర బృందం సంచలన నిర్ణయం తీసుకోగా ఈ అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడకుండా అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రం యొక్క కథ ప్రేక్షకులను అలరిస్తుంది అని తమిళ ప్రేక్షకులు చెబుతున్న ప్రతిసారి కూడా తెలుగులో కూడా ఈ సినిమా వచ్చి ఉంటే బాగుండేది అని సినిమా ప్రియులు ఎంతగానో బాధ పడుతున్నారు. 

అయితే తెలుగులో ఎందుకు ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న కథ రావడం లేదని కూడా ఇంకోవైపు విమర్శిస్తున్నారు. హీరో ఒక ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నప్పుడు టైం లూప్ లో ఇరుక్కు పోతాడు. అలా ఆ టైం లుప్ నుంచి బయటపడడానికి వివిధ రకాలుగా ట్రై చేస్తాడు. ఆ విషయం తెలిసిన విలన్ ఎస్.జె.సూర్య ఏం చేశాడు. అనే మంచి టేస్ట్ ఉన్న కథ తో ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది. అందరినీ థ్రిల్ కి గురిచేస్తుంది. ఇటీవల కాలంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి టైంలో ఇంత మంచి కథ రాలేదనే చెప్పాలి. తెలుగులో కూడా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అనేది చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: