టాప్ హీరోల న‌ట‌వార‌సులు జ‌నాన్ని త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నంలో తండ్రుల‌ను గుర్తుకు తీసుకువ‌చ్చే పాత్ర‌ల్లో త‌ప్ప‌కుండా  న‌టిస్తూ ఉంటారు. తెలుగు నాట తొలి కౌబాయ్ హీరోగా పేరుపొందిన న‌ట‌శేఖ‌ర కృష్ణ వార‌సుడు మ‌హేశ్‌బాబు కూడా అదే పంథాలో ప‌య‌నించారు. మ‌హేశ్‌ను కౌబోయ్ గా చూపిస్తూ.. జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో  ట‌క్క‌రిదొంగ మూవీని నిర్మించారు. ఒక‌ప్పుడు కృష్ణ ట‌క్క‌రిదొంగ, చ‌క్క‌నిచుక్క అనే చిత్రంలో న‌టించారు. టైటిల్‌లో స‌గం త‌న సినిమా పేరుగా జ‌యంత్ చేసుకున్నారు. అలా అభిమానుల‌కు ఆనందం పంచుతూ 2002 జ‌నవ‌రి 12 సంక్రాంతి కానుక‌గా.. ట‌క్క‌రిదొంగ విడుద‌ల అయింది.

కృష్ణ మోస‌గాళ్ల‌కు మోస‌గాడు మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఓ నిధి కోసం అన్వేష‌ణ కొన‌సాగుతుంది. ఆ చిత్రంలో ఉన్న వారిని దోచేస్తూ.. లేని వారికి పంచే పాత్ర‌లో కృష్ణ క‌నిపించారు. అదే తీరున ఇందులో మ‌హేశ్ పాత్ర‌ను తీర్చిదిద్దారు. క‌థ విష‌యానికొస్తే.. ష‌కీల్ అనే వాడు ఓ నిధి అన్వేష‌ణ‌లో సొంత త‌మ్మ‌డినే చంపేస్తాడు. ఆ త‌రువాత నిధి ఎక్క‌డ ఉన్న‌దో తెలిపే చిత్రం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఆ నిధి కోసం దాదాను వెంటాడుతాడు. ష‌కీల్ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలోనే వీరు కాలు పోతుంది. 18 ఏళ్ల త‌రువాత వీరు ఎక్క‌డ ధ‌నం దొరుకుతుందో రాజా అనే అల్ల‌రి దొంగ‌కు తెలుపుతూ ఉంటాడు. త‌న సాహ‌సంతో దోచుకున్న ధ‌నంలో వీరుకు స‌గ‌భాగం ఇస్తూ ఉన్నాడు రాజా.

ప‌న‌స అనే అమ్మాయి కూడా చిల్ల‌ర దొంగత‌నాలు చేస్తూ.. రాజాను ఫాలో అవుతుంటుంది. నిధి మ్యాప్ కోసం త‌న‌ను ఏ రోజు అయినా ష‌కీల్ చంపేస్తాడు అని భావించి వీరు త‌న కూతురు భ‌వానినీ రాజాకు అప్ప‌గిస్తాడు. త‌మ ప్ర‌యాణంలో రాజాకు ఓ ఇల్లు క‌నిపించ‌డంతో అత‌నికి గ‌త జ్ఞాప‌కం గుర్తుకు వ‌స్తుంది. ఓ డాక్ట‌ర్ త‌న తండ్రిని అక్క‌ను చంపాడు అని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుర్మార్గున్ని చంపాల‌నుకున్న‌దే రాజా ల‌క్ష్యంగా మారుతుంద‌ని భావానిని ష‌కీల్ బంధిస్తాడు.  ఆమ్యాప్ అనేది మంట‌ల్లో కాలిపోతుది. భవానికి ఆ మ్యాప్ విష‌యం తెలుసు కాబ‌ట్టే ష‌కీల్ ఆమెను త‌న‌తో తీసుకెళ్లుతానంటాడు. ఆ స‌మ‌యంలో రాజా తండ్రినీ చంపిందెవ‌రో త‌న‌కు తెలుసు అని ష‌కీల్ రాజా చెబుతాడు.  

నిధి అన్వేష‌ణ‌లో షకీల్‌కు స‌హ‌క‌రిస్తాడు. అతిక‌ష్టం మీద మొత్తానికి వ‌జ్రాలున్న దీవి చేరుకుంటారు. అక్క‌డే ష‌కీల్ చేయిపై గుర్తు చూసి, త‌న తండ్రిని చంపేసింది వాడే అని గుర్తు ప‌డ‌తాడు రాజా. ష‌కీల్‌ను చంపేస్తాడు రాజా. చివ‌రికీ ఓ చోట మ‌ళ్లీ ప‌న‌స త‌గులుతుంది. అక్క‌డే ఆమె ప‌క్క‌న మ‌రొక వ్య‌క్తి ఉంటాడు అత‌నెవ‌రో అని రాజాను భ‌వాని అడుగుతుందని ఆయ‌న మోస‌గాళ్ల‌కు మోస‌గాడు అని చెప్ప‌డంతో క‌థ ముగుస్తుంది. మ‌హేశ్ హీరోగా రూపొందించిన తొలిచిత్రం రాజ‌కుమారుడు లోనూ కృష్ణ ఓ కీల‌క పాత్ర పోషించి అల‌రించారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఇందులోనూ క్ల‌యిమాక్స్ కృష్ణ‌ను చూపించి అభిమానుల‌ను అల‌రించారు జ‌యంత్‌.

ఈ చిత్రంలో రాజాగా మ‌హేశ్‌బాబు, భ‌వానిగా లిసారే ప‌న‌స‌గా బిపాషా బ‌సు, ష‌కీల్ రాహుల్‌దేవ్‌.. దాదాగా అశోక్‌కుమార్ అద్భుతంగా న‌టించారు. మిగిలిన పాత్ర‌ల‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజాసింహా, ర‌వి చ‌ల‌ప‌తి క‌నిపించారు. కామెడీ రోల్‌లో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ కూడా తెర‌పై త‌ళుక్కుమ‌న్నారు. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స‌మ‌కూర్చిన సంగీతం ఎంత‌గానో అల‌రించింది. భువ‌న‌చంద్ర‌, చంద్ర‌బోస్ పాట‌లు రాసారు. న‌లుగురికి న‌చ్చిన‌ది నాక‌స‌లే న‌చ్చ‌దులే.. అలేబా అలేబా..హేమామా బాంగుద‌మ్మో పాట‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌ధానంగా ఈ సినిమాకు మ‌హేశ్‌కు స్పెష‌ల్ జ్యూరీ అవార్డు ల‌భించింది. బెస్ట్ ఆడియోగ్రాఫ‌ర్ గా పి.మ‌ధుసూద‌న‌రెడ్డి, బెస్ట్ హిట్ మాస్ట‌ర్‌గా విజ‌య‌న్‌, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా జైన‌న్ విన్సెంట్‌, ఉత్త‌మ బాల‌న‌టుడిగా మాస్ట‌ర్ కౌశిక్ నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మందిని అల‌రించిన కౌబోయ్ మూవీ మెక‌నాస్ గోల్డ్ చిత్రీక‌రించిన అమెరికాలోని కొల‌రాడో ప‌ర్వ‌త ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ‌గా జ‌రిగింది. అప్ప‌ట్లో టక్క‌రిదొంగ అభిమానుల‌ను భ‌లేగా అల‌రించింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: