నటవారుసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో హీరో వెంకటేష్ ఒక్కరు. ఆయన సినిమాలో ఫ్యామిలీ హీరోగా రాణిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గతంలో ఒక టీవీ చానల్లో కూడా పెట్టుబడులు పెట్టిన విషయం అందరికి తెలిసిన విదితమే. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మల్టీప్లెక్స్ థియేటర్స్ రంగంలో ప్రవేశం చేసిన విషయం తెల్సిందే. ఇక వీరి అడుగుజాడల్లోనే హీరో విజయ్ దేవరకొండ కూడా హోమ్ టౌన్ మహబూబ్ నగర్ లో మల్టీ ప్లెక్స్ థియేటర్ ని ప్రారంభించినట్లు సమాచారం.

ఇక హీరో విక్టరీ వెంకటేష్ కూడా తన అడుగులను బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరల కారణంగా వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలకి ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది. దాంతో ఈ రంగానికి భారీ డిమాండ్ ఎక్కువ అయ్యింది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన విక్టరీ వెంకటేష్ ఈ రంగం వైపు తన అడుగులు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు..  ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం అందించే బైక్ వో కంపెనీలో పెట్టుబడులతో హీరో వెంకటేష్ వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అంతేకాక.. ఈ కంపెనీల వెంకటేష్ వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం తో పాటు ఆ కంపెనీ వెంకటేష్ ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఆ కంపెనీని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బైక్ వో తో విక్టరీ వెంకటేష్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం తో సినీ ఇండస్ట్రీలో వర్గాలతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఇక వెంకటేష్ f-3 సినిమా సినిమా తర్వాత ఏ సినిమాను ఒప్పుకోకపోవడంతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపారం వైపు దృష్టి సాగిచనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: