సమంత రానురాను పూర్తిగా మారిపోతోంది.. ఈమె ఎక్కువగా ఇప్పుడు జిమ్ సెంటర్ లోనే తమ సమయాన్ని గడుపుతూ ఉన్నది. అందులో సరికొత్త డాన్సులతో, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా ఆమె తన అలవాట్లలో జిమ్ ను కూడా యాడ్ చేసుకుంది. ప్రతిరోజు కొన్ని వర్కౌట్ లు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వాటిని తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. అయితే తాజాగా ఒక డిఫరెంట్ వర్కౌట్ ను ట్రై చేసింది సమంత. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియో చూసిన తన స్నేహితులకు పంపించి ఇలా ట్రై చేయమని ఛాలెంజ్ కూడా విసిరింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా అవుతోంది. సమంత ఎప్పటికప్పుడు తన ఆరోగ్య విషయంపై కొన్ని డైట్ చిట్కాలను పాటిస్తూ ఉంటుంది. ఇక అలాగే తన తోటి వారిని కూడా అలాగే ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే సమంత గత కొద్దిరోజులుగా షూటింగ్, తన వ్యక్తిగత సమస్యల వల్ల జిమ్ కు దూరంగా ఉండేది. కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఆమె రెగ్యులర్ జిమ్ లోనే తన సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. అయితే తాజాగా "లెవెల్ అప్" అనే ఒక సరికొత్త వర్కౌట్ ను తన ఫ్రెండ్స్ కి షేర్ చేసింది. వారిని కూడా అలాగే ట్రై చేయమని ఒక ఛాలెంజ్ ను కూడా చేసింది.

అలా "లెవెల్ అప్"  ను సమంత స్నేహితుడైన హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ కు కూడా ఈ వీడియో ని షేర్ చేసింది సమంత. ఇక ఆమె స్నేహితురాలు ఎవరు కూడా ఈ చాలెంజ్ ను పూర్తి గా చేయలేకపోయారు. ఇక వారు చేసిన కొన్ని ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు కూడా తాజాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా సమంత చాలా హ్యాపీగా ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: