దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒక సామెత..  ఇక ఇదే సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొంతమంది స్టార్లు. వర్క్ బాగా ఫేమస్ లో ఉన్న టైం లోనే నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఇక హీరో హీరోయిన్లు ఒకపక్క సినిమాలు ఇంకా మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు.  ఇకపోతే బాలీవుడ్ అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు ఎన్నో బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన కుర్ కురే చిప్స్ కి బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విషయం తెల్సిందే. ఇక దీనికి సంబంధించిన యాడ్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఇక ఈ యాడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంది. ఇకపోతే ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ అర్ధరాత్రి హీరోయిన్ సమంత ఇంటికి దొంగతనానికి వస్తాడు. ఇంట్లోకి వచ్చి అక్కడ కుర్ కురే ప్యాకెట్ చూసి దాన్ని విప్పబోతాడు.అక్షయ్ కుమార్ చేసిన ఆ సౌండ్ కి సమంత ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. అక్షయ్ చేతిలో ఉన్న ఆ కుర్ కురే ప్యాకెట్ ని లాక్కొని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటారు. ఇక వారు తినడం చూసి నోరురిపోతున్నట్లు, తనకి పెట్టమని అడగడంతో సామ్, అక్షయ్ కి ఆ ప్యాకెట్ ఇస్తుంది. అది ఖాళీ చేసి వెళ్ళిపోతుండగా.. బండి వస్తుంది ఆగమని చెప్తోంది సమంత.. ఓ బండి కూడా ఇస్తారా అని అక్షయ్ ఆనందపడేలోపు పోలీస్ సైరెన్ మోగుతోంది. దీంతో అక్షయ్ పని అయిపోతోంది.

 ఇక తాజాగా ఈ వార్తను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన హీరో కుర్ కురే దొంగగా మారాడు... అక్షయ్ కుమార్ ఏంటి ఈ ప్రవర్తన' అంటూ చెప్పుకొచ్చింది....అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇక సమంత సినిమా విషయానికొస్తే తే ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసింది తాజాగా యశోద అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది దీంతోపాటు హాలీవుడ్లో కూడా ఓ సినిమాకి సైన్ చేసింది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: