సినీ రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరికి ఏ అదృష్టం దక్కుతుంది, ఎప్పుడు ఎవరు తారా స్థాయి నుండి అట్టడుగు స్థాయికి పడిపోతారు అన్నది అస్సలు ఊహించలేము. ఇదే తరహాలో అచ్చ తెలుగమ్మాయి అంజలి ఊహించని రీతిలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన మార్క్ ను క్రియేట్ చేసింది. అయితే కొన్నాళ్లకే అవకాశాలు తగ్గడంతో కనుమరుగైపోయింది ఈ చిన్నది. కాగా మళ్ళీ 'వకీల్ సాబ్' చిత్రం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్ళీ దూకుడు పెంచారు. అయితే ఈ సౌత్ ఇండియన్ గ్లామర్ బ్యూటీ పెళ్లి గురించి ఎపుడు హాట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. నిజానికి యంగ్ హీరో హీరోయిన్ల పెళ్లి మ్యాటర్స్ ఎపుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి.

ఇదే రీతిలో కరోనా లాక్ డౌన్ సమయంలో వరుసగా పలువురు హీరో,హీరోయిన్లు పెళ్లి బాట పట్టగా.. అంజలి పెళ్లి మ్యాటర్ కూడా వైరల్ అయ్యింది ..అయితే ఇందుకు రియాక్ట్ అయిన అంజలి ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదని ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరియర్ పైనే అని క్లారిటీ ఇచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తన లక్ ను పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పట్లో తమిళ్ హీరో జై ప్రేమలో  మునిగి తేలుతోంది అంటూ వార్తలు షికార్లు చేశాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి పలు విడియోలు షేర్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేరింది. కానీ ఆ తర్వాత వాటికి ఎండ్ కార్డ్ కూడా పడింది.

గతంలో అంజలి రెండు మంచి సినిమా ఆఫర్స్ ను మిస్స్ అయ్యింది. అవి రెండూ కూడా నటసింహం బాలకృష్ణ తోనే కావడం విశేషం.  ఆయన సూపర్ హిట్ చిత్రాలు లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్ గా చేయమని తొలుత అంజలికే ఆఫర్ వచ్చిందట అయితే అప్పట్లో ఆమెకు డేట్స్ కుదరకపోవడం తో రెండు సినిమాలను వదులుకోక తప్పలేదు. ఆ తరవాత మూడోసారి బాలయ్య డిక్టేటర్  చిత్రంలో ఆఫర్ రాగా అన్ని డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకుని మూవీ చేసింది. అయితే ఆమెకు ఆశించిన ఫలితం దక్కలేదని చెప్పాలి. అందుకే అంటారు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే పరిస్థితులు మారిపోతాయి అని అందుకు అంజలి ఒక ఉదాహరణ. ఒకవేళ ఆ రెండు సినిమాలు అంజలి చేసుంటే కథ వేరేలా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: