నటసింహం నందమూరి బాలకృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు నటించిన ‘అశ్వమేధం’ సినిమా గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సీ.అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. 1992లో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో భారీగా నష్టపోయినట్లు సమాచారం. ఎందుకంటే ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో సినిమాల సంఖ్య భారీగా పెరిగింది.. ఫలితంగా నాణ్యత లేని కథలు వచ్చాయి. దీంతో ఆ సినిమాలు దారుణంగా ఫ్లాపులు అయ్యాయి. వీటిలో అశ్వమేధం కూడా ఉంది. సినీ పరిశ్రమపై చర్చించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది.

నిర్మాత అశ్వినీదత్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా తర్వాతనే ‘అశ్వమేధం’ సినిమాను తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రెండు సినిమాలు అప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కించారు నిర్మాత అశ్వినీదత్. ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతో కలిసి ‘అశ్వమేధం’ సినిమా తీయాలని అనుకున్నారు.

బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్‌లో తొలి సినిమా తీయాలని భావించిన నిర్మాత.. డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో సినిమా తీయాలనుకున్నారు. వీరిద్దరి డేట్స్ తీసుకుని సినిమా లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ, కుదరలేదు. అయినా, పట్టువదలని విక్రమార్కునిలా ఎనిమిటి నెలల తర్వాత మరో కథను రెడీ చేయించాడు. కథ రెడీ అవ్వడంతో హీరో శోభన్ బాబు, నటసింహం బాలయ్యతో కలిసి ‘అశ్వమేధం’ సినిమాను ప్రారంభించారు.

ఈ సినిమాను 1992 జూన్ 29న హీరో నాగార్జున కెమెరాను స్విచ్ఛాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అశ్వమేధంలో పోలీస్ ఆఫీసర్ అభిమన్యుడిగా శోభన్ బాబు, అతని తమ్ముడు పైలెట్ ఆఫీసర్‌గా బాలకృష్ణ నటించారు. హీరోయిన్లుగా నగ్మా, మీనా నటించారు. అమ్రిష్ పూరి, కోట శ్రీనివాసరావు, రాధారవి విలన్లుగా వ్యవహరించారు. దాదాపు రూ.3 కోట్ల బడ్జెట్‌తో ‘అశ్వమేధం’ సినిమాను తెరకెక్కించారు. 1992 డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అవ్వగా.. 8 సెంటర్లల్లో 50 రోజుల వరకు ఆడింది. ఈ సినిమాకు ముంబై నుంచి ప్రత్యేక టీంను రప్పించి.. ఇళయరాజా సంగీతం అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: