మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే క్రాక్ సినిమా ఇచ్చిన జోష్ లో రవితేజ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.  అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నాడు.  ఈ సినిమాలో పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ధమాకా సినిమాలో నటించబోతున్నాడు.

అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాలో కూడా రవితేజ నటించబోతున్నాడు. అయితే ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే రవితేజ ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించబోతుంనట్లు చిత్ర బృందం చిన్న హింట్ ఇచ్చింది. ఆ తర్వాత హాట్ బ్యూటీ దక్ష నగర్కార్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతునట్లు చిత్ర బృందం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇలా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్ లతోనే ఈ చిత్ర బృందం సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలతో పాటు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'  సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: