సినిమా ఎలా ఉన్నా ప‌ర్లేదు అది క్రియెటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ నుంచి వ‌స్తే చాలు.. ఎవ్వ‌రికో ఒక‌రికి తెలియ‌ని ఉత్తేజ శ‌క్తి వ‌స్తుంది.. ఎవ్వ‌రికో ఒక‌రికి కొత్త ఆనందం పుడుతుంది..తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకునే కొత్త కొత్త సినిమా ద‌ర్శ‌కుల‌కు ఆయ‌న సినిమానే ఓ క్లాస్ .. కొన్నిసార్లు అది క్లాసిక్ కూడా! ఏ త‌ర‌గ‌తి నేర్ప‌ని పాఠం, పాఠ‌వం కూడా ఆయ‌న సొంతం. అందుకే ఆయ‌న సినిమాల్లో ఎవ్వ‌రు న‌టించినా కూడా పేరు వ‌చ్చేది అంతిమంగా కృష్ణ‌వంశీకే! ఒక యాక్ట‌ర్ ను త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకుని న‌టింప‌జేసే కొద్దిమంది ద‌ర్శ‌కులలో పేరొందిన వ్య‌క్తి ఆయ‌నే! నో డౌట్ ఇన్ ఇట్.. ఇంత‌టి పేరున్న డైరెక్ట‌ర్ ఓ ఆర్టిస్టును ప్ర‌శంసించ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. ఆయ‌న ఎవ‌రిని అమ్మోరు అన్నారంటే...?

న‌ట‌న ప‌రంగా అమ్మోరు
అభిన‌యం తో పాటు
అందం ప‌రంగా కూడా
ఓ విధంగా శివాత్మిక
అమ్మోరు రూప‌మే!

 
సినిమాల్లో అమ్మోరులు ఉంటారు.. సినిమాలోనూ నిజ జీవితంలోనూ అమ్మోరులు ఎంతో మంది ఉన్నారు. కానీ కృష్ణ వంశీ దృష్టిలో మాత్రం హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాత్మిక‌నే అమ్మోరు.. ఆమె మాత్రమే త‌న సినిమాలో అనుకున్న క్యారెక్ట‌ర్-కు న్యాయం చేయగ‌ల‌దు అన్న న‌మ్మ‌కంతో ఉన్నారు ఆయ‌న.అదేవిధంగా ఈ సినిమాలో మ‌రో ముఖ్య‌పాత్ర‌ను ప్ర‌కాశ్ రాజ్ పోషిస్తుండ‌డం, ఆయ‌న న‌ట‌నా వైశిష్ట్యంపై ఇప్ప‌టికే ఎన్నోసార్లు ప్ర‌శంస‌లు గుప్పించ‌డం కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం.

చిర కాల స్నేహితుడు
ప్ర‌కాశ్ తో ప్ర‌యాణిస్తూ...
కొత్త ప్ర‌పంచంలో
ఇళ‌య‌రాజాతో పాటు
కృష్ణ వంశీ ఎలా ఉన్నారో?


రంగ‌మార్తాండ సినిమాతో క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.ఆయ‌న మార‌థాన్ షూట్-ను చేస్తున్నారు ఈ సినిమా కోసం..ఇందుకు సంబంధించిన స్టిల్స్ కూడా ఎఫ్బీలో పోస్టు చేశారు. ఈ షూట్ లో శివాత్మిక ప‌నితీరును, రాహుల్ సిప్లిగంజ్ ప‌నితీరును ఎంత‌గానో మెచ్చుకున్నారు. శివాత్మికని అమ్మోరు అని వ్య‌వ‌హ‌రించారు. న‌ట రాక్ష‌సుడిగా ప్ర‌కాశ్ రాజ్ ను అభివ‌ర్ణించి ఉండ‌వ‌చ్చు.. మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ గా రాహుల్ ని ప్ర‌శంసిస్తూ షూట్ అప్డేట్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: