తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకుని ఎన్నో రోజుల పాటు స్టార్ హీరోగా కొనసాగారు రాజశేఖర్. తెలుగు చిత్ర పరిశ్రమలో రాజశేఖర్ చక్రం తిప్పుతారు అనుకుంటున్న సమయంలో వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఆయన కెరియర్ కు దెబ్బ పడింది. ఇక ఒకప్పుడు సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయిన రాజశేఖర్ ఇక ఎన్నో రోజుల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత గరుడ వేగా అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 ఆ తర్వాత కల్కి అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ మరో విజయాన్ని అందుకున్నారు. ఇలా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తూ నేటి రోజుల్లో యువ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు రాజశేఖర్. ఇకపోతే  ఇటీవలే రాజశేఖర్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్టుగా విచ్చేసారు.ఆయనతో పాటు ఆయన సతీమణి జీవిత కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఇక ఆయన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు రాజశేఖర్. ఈ సందర్భంగా అంకుశం సినిమా సమయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్పుకొచ్చారు.



 అంకుశం సినిమా షూటింగ్ చార్మినార్ వద్ద జరిగిన సమయంలో రామిరెడ్డి ని కొట్టుకుంటూ తీసుకు రమ్మంటే నిజంగానే కొట్టారట కదా అంటూ కమెడియన్ అలీ రాజశేఖర్ అని అడిగాడు. ఇక రాజశేఖర్ సమాధానం చెబుతూ.. రామిరెడ్డి గారు సున్నిత మనస్కులు ఎవరైనా ఏమైనా మాట అంటే అస్సలు పడేవారు కాదు. అయితే ఆ షూటింగ్లో నేను కొట్టినట్లుగా నటిస్తున్నప్పటికీ ఆయన మాత్రం కదలట్లేదు.. చూసేవారు ఏమనుకుంటారో అనుకొని ఇక దెబ్బ తగలనట్లుగానే యాక్టింగ్ చేస్తున్నారు. దీంతో దర్శకుడు కోడి రామకృష్ణ నా దగ్గరికి వచ్చి రామీ రెడ్డి నిజంగానే కొట్టాలి అంటూ చెప్పారు.  ఇక కొడితేగాని రామిరెడ్డి గారు యాక్టింగ్ చేయారేమో అనుకుని నిజంగానే కొట్టుకుంటూ తీసుకొచ్చాను. అలా ఆ సన్నివేశం జరిగిపోయింది. అయితే ఆ సన్నివేశాల్లో నటించడం అస్సలు రామిరెడ్డి గారికి ఇష్టం లేదు. కానీ సినిమాలో అదే సీన్ హైలెట్ గా మారిపోయింది అంటూ హీరో రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: