అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఏ రేంజ్ లో విజయవంతం అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చినప్పుడు దీనికి సీక్వెల్ తీయాలనే ఆలోచన మేకర్స్ దృష్టిలో వచ్చిందో ఏమో అప్పటి నుంచి నాగార్జున ఈ దర్శకుడితో కలిసి ప్రయాణం చేస్తూ బంగార్రాజు చిత్ర కథను తయారు చేయిస్తున్నాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలతో కళ్యాణ్ కృష్ణ చేయగా మొదటినుంచి కూడా ఈ ప్రాజెక్టు ను నమ్ముకొని ఈ ఒక్క ప్రాజెక్టు మీద సంవత్సరాలకు సంవత్సరాలు పని చేశాడు. ఆ విధంగా ఎట్టకేలకు అక్కినేని నాగ చైతన్య నటించిన ఈ సినిమాజనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్యకు తాత పాత్రలో నాగార్జున నటిస్తున్న ఈ సినిమా కూడా సోగ్గాడే చిన్నినాయన సినిమా లాగానే తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రం యొక్క ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది అని చెబుతోంది. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన పాయింట్స్ ను కూడా చేస్తూ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడేలా చేస్తుంది. ఆ విధంగా ఈ చిత్రంలోని ఒక కీలకమైన ఆసక్తి కలిగించే విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది చిత్రబృందం.

బంగార్రాజు సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని ఇటీవలే ఈ సినిమా బృందం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా బంగార్రాజు చిత్రం కాగా బంగార్రాజు చిత్రం రూపొందుతుందని త్వరలోనే దీనికి సంబంధించిన సమాధానం బయటకు వస్తుందని వారు వెల్లడిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్ర క్లైమాక్స్ ను కూడా ఆ విధంగానే డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక ఇది పూర్తిగా అక్కినేని నాగ చైతన్య సినిమా మాత్రమే ఇందులో నాగార్జున కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే చేశాడని అంటున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య చేస్తున్న ఈ సినిమా సక్సెస్ ఆయనకు అందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: