అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్,  నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికి  ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు తగ్గడంతో నిధి అగర్వాల్ కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కు రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం దక్కింది.  అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన హీరో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.


అయితే ఇందులో భాగంగా నిధి అగర్వాల్ కు మీకు  డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురైంది... అయితే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ నిధి అగర్వాల్... నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది.  నేను యాక్షన్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను అని నిధి అగర్వాల్ తెలియజేసింది. ఇలా నిధి అగర్వాల్ కు యాక్షన్ రోల్స్ చేయాలని ఉన్నట్లు తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా నిధి అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: