మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ప్రస్తుతం నాలుగు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయని చెప్పవచ్చు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన చేసిన ఖిలాడి చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పాటలు విడుదల కాగా ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అభిప్రాయాన్ని భారీ అంచనాలను ఈ పాటలు ఏర్పరచాయని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని కూడా రవితేజ అనౌన్స్మెంట్ చేశాడు. రవితేజ కెరీర్లో 68వ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తనదైన శైలిలో చేస్తున్నాడు.

ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ గా పని చేస్తుండగా ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ కు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని అంటున్నారు. ఇక ఈ సినిమా తో పాటు ఆయన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కూడా తొందరలోనే మొదలు కాబోతోందని తెలుస్తుంది. ఇక ఇటీవల దర్శకుడు సుధీర్ వర్మ తో కలిసి రావణాసుర అనే చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు రవితేజ. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని విధంగా రవితేజను ఈ చిత్రంలో చూడబోతున్నారు అని గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ. 

సినిమా యొక్క లుక్ తోనే చిత్రంపై మంచి అంచనాలు పెంచేశాడు దర్శకుడు. అంతకుముందు ఆయన శర్వానంద్  కలిసి తీసిన రణరంగం  చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులతో నిరాశపరచడంతో ఈ సినిమా తో తప్పకుండా ప్రేక్షకులను అలరించాలని చెప్పి ఇప్పుడు ఈ సినిమాను చేస్తున్నాడు. సుశాంత్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. ఆయిన హీరో తో ఏ విధమైన శత్రుత్వాన్ని కొనసాగించాడు ఏ విధంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు అనేది ఈ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తుంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: