మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాకు బ్యాడ్ లక్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా పోయిన ఏడాది వేసవికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా అప్పుడు ఈ చిత్రం విడుదలకు మొగ్గు చూపలేదు. దాంతో విడుదల తేదీ కోసం కొన్ని నెలలు వేచి చూసి చివరకు సంక్రాంతికి విడుదల కావాలని భావించగా అప్పుడు పెద్ద సినిమాల విడుదలలు ఉండటంతో విడుదల తేదీని కూడా మరొకసారి పోస్ట్ పోన్ చేశారు. అలా ఫిబ్రవరిలో సోలో గా విడుదల కావాలని చిత్ర బృందం ఫిబ్రవరి 3వ తేదీన సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.

అయితే మరొక సారి ఈ సినిమాకు బ్యాడ్ లక్ ఎదురయింది అని చెప్పవచ్చు. కరోనా మరొకసారి దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. తొందర్లోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తెరపై కనిపించి చాలా రోజులవుతుంది.ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా లో ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా మణిశర్మ సంగీతం నుంచి వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చిత్రంపై భారీ అంచనాలు కూడా ఈ పాటలు పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు సంవత్సరం నుంచి ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతూ రాగా ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి ఆశలను తీరుస్తూ ఉందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: