హీరో సిద్ధార్థ్‌ ఒక్కప్పుడు తాను చేసిన సినిమాల ద్వార ఎంత పాపులర్ అయ్యాడో..ప్రస్తుతం కాంట్రవర్షీయల్ కామెంట్స్ ద్వార అంత ట్రోల్ అవుతున్నాడు. ఒక్కప్పుడు బొమ్మరిలు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరో గా నటించి స్టార్ హీరో రికార్డు లను సైతం బద్దలు కొట్టిన ఆయనంటే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఉండేది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ ..ఆ బాడీ లాంగ్వేజ్..ఆ డైలాగ్ డెలివరీ..తెర పై ఈయన బొమ్మ పడితే అబ్బో అప్పట్లో అదే సెన్సేషన్..జనాలు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోయారు. ఇదంత ఒక్కప్పటి సీన్.

ప్రస్తుతం హీరో సిద్ధార్థ్‌ కధ వేరేలా ఉంది. సినిమా అవకాశాలు ఇచ్చేవారే లేరు..ఇచ్చిన హిట్ కొట్టే సీన్ కనిపించడంలేదు..దీనికి తోడు అవసరం ఉన్నా  లేకున్నా ప్రతి  మ్యాటర్ లో ఫింగర్  పెట్టి తిట్టించుకోవడం కామన్ అయిపోయింది సిద్ధార్థ్‌ కి అంటున్నారు కొందరు నెటిజన్స్. ఇక ఇవన్నీ చూస్తుంటే రాం గోపాల్ వర్మకి తమ్ముడిగా బిహేవ్ చేస్తున్నాడు సిద్ధార్థ్‌  అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాం గోపాల్ వర్మ కూడా అంతే .. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంలో ఆయన ముందుంటారు. ప్రతి విషయాని ఆయన కోణంలో చూసి స్పందించడం వర్మకి అలవాటు.

ఇక గత కొన్ని రోజులుగా సిద్ధార్థ్‌ VS సైనా నెహ్వాల్‌ మధ్య ట్వీట్టర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సైనా నెహ్వాల్‌ ..మోదీ కి పాజిటివ్ గా ట్వీట్ చేయడం..దానికి అనూహ్యంగా సిద్ధార్థ్‌ కౌంటర్ ఇవ్వడం..అది కాస్త వల్గర్ గా ఉండటం తో ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఇక వరుసగా అందరు సిద్ధార్థ్‌ పై ట్విట్లతో దండయాత్ర ప్రారంభించారు..దేశద్రోహి అంటూ కూడా ఆయనని తిట్టిపోసారు. అంతేనా హీరో సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపడంతో బీజేపి నాయకులు ఆయన పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ విషయమే హైలెట్ గా ట్రేండ్ అవుతుంది. దీంతో అందరు మనకు మరో RGV దొరికాడు అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV