ప్రభాస్..వరుస పాన్ ఇండియా సినిమాలతో ఏ హీరో కూడా టచ్ చేయలేనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ప్రభాస్ ఇప్పుడు ఈ రేంజ్ లో  ఉండటానికి ఎకైక కారణం బాహుబలి సిరీస్ అన్ని అందరికి తెలిసిందే. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అయిన ఈ ఆరు అడుగుల అందగాడు..ప్రస్తుతం సక్సెస్ ని తన బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇక ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మాటకు వస్తే కేవలం తెలుగు, హిందీ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు బోలెడు అభిమానులు ఉన్నారు.

జనాల్లో ఆయన అంటే అంతటి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఇక అంతటి క్రేజ్ ఉంటే మన డైరెక్టర్లు వదులుతారా..నో ఛాన్స్..ఆయన ద్వార పలు సినిమాల టీజర్ లు, ఫస్ట్ లుక్ లు విడుదల చేయించి..ఆయనకు ఉన్న క్రేజ్ ని వాడుకోవాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే అలా ప్రభాస్ క్రేజ్ ని వాడుకున్న వారిలో యంగ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు దిల్ రాజు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తూ..టాప్ నిర్మాతల లిస్ట్ ఉన్న దిల్ రాజు బ్రదర్ కొడుకు   అశిష్‌ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

‘రౌడీ బాయ్స్‌’ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండడం..అందులో హాట్ సీన్స్ తో రెచ్చిపోయి కనిపించడం అందరిని షాక్ కు గురి చేసింది. హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు.  దీంతో  ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు టీం. ఈ క్రమంలోనే ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ని పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ కి కొత్త అనుమానలు వస్తున్నాయి. ప్రభాస్ అందరి హీరో సినిమాలని ప్రమోట్ చేస్తున్నాడు కానీ..ఆయన సినిమాని మాత్రం అస్సలు ప్రమోట్ చేయడంలేదు..దీని కారణం ఆయన సినిమా పై పెట్టుకున్న నమ్మకమా ..లేక ఎలాగైన అభిమానులు హిట్ చేస్తారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నా అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు నెటిజన్స్ ..?

 


మరింత సమాచారం తెలుసుకోండి: