ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతున్న అందరు ముద్దుగుమ్మలు మరో సినిమాలో ఐటేం సాంగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సినిమా మొత్తం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ ఒక్క స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ చేస్తే వచ్చేస్తుంది. దీంతో చాలా మంది హీరోయిన్ లు ఐటెం సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ మధ్యనే స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత అల్లు అర్జున్ పక్కన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి బ్లాక్ బస్టర్ స్పెషల్ సాంగ్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఎక్కడ చూసిన కానీ.."ఊ అంటావ మావ..ఊ ఊ  అంటావా మావ"..అంటూ పాడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఈ పాటని ఎంజాయ్ చేస్తున్నారు అధే విధంగా పార్టీలోను ఈ పాట పెట్టుకుని డ్యాన్స్ లు వేస్తున్నారు అంటేనే ఈ సాంగ్ ఎంత బాగా అభిమానులకు నచ్చిందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక సమంత కన్నా ముందు కూడా చాలా మంది హీరోయిన్ లు ఐటెం సాగ్ చేయడానికి సైన్ చేసి హిట్ కొట్టిన వారు ఉన్నారు. వాళ్లల్లో తమన్నా కూడా ఒకరు. తమన్నా భాటియా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లైనా ఇప్పటికీ ఆమె అందాలు ఆరబోయడంలో ఎటువంటి మార్పు లేదు. చెక్కు చెదరిని హాట్ అందాలతో కుర్రాళ్ల మతులుపోగొడుతూ ఇప్పటీకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది తమ్మూ బేబీ. అమ్మడు తన కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంది. అందుకే  హీరోయిన్‌గా పలు బడా సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఐటెం సాంగ్స్‌లో కూడా నటించి తన ఖాతా నింపుకుంది.

రీసెంట్ గా తమ్మూ బేబీ మెగా  హీరో వరుణ్ తేజ్ పక్కన ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ‘గని’ టీం. ఇన్ని రోజులు ఈ విషయాని సస్పెన్‏లో పెట్టిన గని మూవీ మేకర్స్ నేడు స్పెషల్ సాంగ్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అఫిషియల్ గా తెలిపింది. ఇప్పటికే  తమన్నా..జైలవకుశ, అల్లుడు శ్రీను,  జాగ్వార్, స్పీడున్నోడు,  సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: