టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్టార్ హీరో కొడుకు అక్కినేని నాగచైతన్య ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట్లో బాగానే సాగిన వీరి సంసారం..నాలుగేళ్లు గడిచేసరికి యూటర్న్ తీసుకుని విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి వరకు పార్టీలు, టూర్ లు, హనీమూన్ లు అంటూ బాగానే ఉన్న ఈ జంట కు విడాకులు తీసుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం వచ్చిందో జనాలకు అర్ధంకాక వాళ్లకు నచ్చినవి ఊహించుకున్నారు.
ఈ క్రమంలోనే వీళ్లిద్దరి విడాకుల మ్యాటర్ లో మధ్యలోకి వచ్చిన ప్రీతమ్‌ జుకల్కర్‌ బలైయాడు. అప్పటి వరకు బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఈయన ..వాళ్ల విడాకులు తీసుకొవడానికే ఈయననే కారణం అంటూ కొన్ని పుకార్లు  హల్ చల్ చేసాయి. ఇక దానికి తోడు సమంత ప్రీతమ్‌ జుకల్కర్‌ తో దిగ్గిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో సమంత ప్రీతమ్‌ జుకల్కర్‌ మీద కాళ్లు వేసి ఉండగా ..దగ్గరగా సెల్ఫీలు  తీసుకోవడం.. క్లోజ్ గా మూవ్ అవ్వడంతో వీళ్ల మధ్య ఎఫైర్ నడుస్తుందని కూడా రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. అంతేనా ఒకానొక దశలో సమంత చైతన్య కి విడాకులు ఇచ్చింది ప్రీతమ్‌ జుకల్కర్‌ ని పెళ్లి చేసుకోవడానికే అంటూ సోషల్ మీడియాలో వార్తలు మారుమ్రోగిపోయాయి. ఇక ఫైనల్ గా ప్రీతమ్‌ జుకల్కర్‌ రెస్పాండ్ అయ్యి..సమంత నాకు అక్క తో సమానం..అంటూ ఆ వార్త లని  ఖండిచడంతో అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డాయి.
ఇక మళ్లీ ఇన్నాళ్లకు సమంత ..ప్రీతమ్‌ జుకల్కర్‌ పేరు తీయ్యడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సమంత కి వర్క్ అవుట్స్ చేయడం అంటే ఇష్టమని తెలిసిందే. ఫిట్‌నెస్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టే హీరోయిన్లల్లో సమంత ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. రీసెంట్ గా  సామ్‌ లెవల్‌ అప్‌ అనే కొత్త వర్కవుట్‌ ఛాలెంజ్‌ను తన స్నేహితులకు ఇచ్చింది. వాళ్లల్లో మేకప్ ఆర్టిస్ట్ రంభియా, హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్,  ప్రీతమ్ జుకల్కర్‌లు కూడా ఉన్నారు. ఇక వాళ్లు ఈ ఛాలెంజ్‌ ను స్వీకరిస్తూ ట్రై కూడా చేశారు. రోహిత్‌ ఈ ఛాలెంజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగా రంభియా, ప్రీతమ్‌ చేయలేకపోయారు. దీంతో సమంత.." నేను ఎంకరేజ్‌ చేస్తున్న కానీ..ప్రీతమ్‌ వల్ల అవ్వడం లేదు" అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: