ప్రస్తుతం ఇండస్ట్రీలో కన్నడ భామ కృతి హవా నడుస్తుంది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ లేత బ్యూటీ..ఒక్కోక్కటిగా సినిమా ను ఫైనల్ చేస్తూ..చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ మిగతా హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తుంది. ఉప్పెన సినిమాలో సంగీత క్యారెక్టర్ లో ట్రెడిషనల్ గా కనిపించి ఆకట్టుకున్న ఈ అమ్మడు..తన సెకండ్ సినిమాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచింది. యంగ్ మోడ్రెన్ లుక్  లో కనిపిస్తూ..హాట్ లుక్స్ తో ధియేటర్ కు వచ్చిన కుర్రాళ్లకు చమటలు పట్టించింది.

నాని తో కలిసి శ్యాం సింగ రాయ్ మూవీలో నటించిన కృతి శెట్టి తన పర్ ఫామెన్స్ కు మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఇప్పుడు కృతి నటించిన మూడో సినిమా సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతుంది. అక్కినేని నాగార్జున ,రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నాగ చైతన్య హీరోగా..కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తున్న మూవీ బంగార్రాజు. ఈ సినిమాలో కృతి.. చై తో పోటీ పడి నటించిందని  ఇప్పటికే  నాగార్జున  చాలా ఇంటర్వ్యులో  చెప్పుకొచ్చారు. నాగలక్ష్మి పాత్రలో కృతి చించేసింది అంటున్నారు చిత్ర బృందం.

సంక్రాంతి కానుకగా జనవరీ 14 న ధియేటర్స్ లో గ్రాండ్ గా ‘బంగార్రాజు' సినిమాను  రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో కృతి మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాల గురించి తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.." బంగార్రాజు సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరేంట్. అసలు ఎవరు ఊహించలేరు. మీరు ధియేటర్స్ లో నాగ లక్ష్మిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ నాకు కల్యాణ్‌ కృష్ణగారు ఈ క్యారెక్టర్  గురించి చెప్పిన్నప్పుడు  నవ్వేశాను..అసలు ఇలాంటివారు  కూడా ఉంటారా అని అనిపించింది.
అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా" అంటూ చెప్పుకొచ్చిన కన్నడ భామ కృతి..గ్లిజరిన్‌ లేకుండా ఏడుపు సీన్స్‌ చేయగలను అని చెప్పి షాక్ ఇచ్చింది.  నటిగా ఎదగడానికి నేను అన్ని నేరుచుకుంటున్నా..ఎటువంటి సీన్ అయిన ఎంజాయ్ చేసి చేస్తా అందుకే చూసేవాళ్లకి బాగా నచ్చుతుంది"..అంటూ క్లారిటీ ఇచ్చింది.  అమ్మడు మాటలు విని  కొందరు కృతికి టెక్ ఎక్కువే..ఇండస్ట్రీలో  హీరోయిన్ గా రావలంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి చూడాలి నాగలక్ష్మి పాత్ర కృతికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: