సాయి కుమార్ కొడుకు అది హీరోగా నటించిన సినిమా ప్రేమకావాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇషా చావ్లా నటించింది. ఇక ఇషా చావ్లా కూడా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరికొన్ని అవకాశాలను అందుకుంది. ఆమె స్టార్ హీరో బాలయ్య సరసన శ్రీమన్నారాయణ సినిమాలో నటించింది. అయితే కమెడియన్ సునీల్ తో కలిసి పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలో నటించారు. కాగా.. ఆమె నటించిన సినిమాలలో ఒకటి కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇక ప్రేక్షకులు అందరు ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అందరు భావించారు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా ఈ అమ్మడికి ఫేడ్ అవుట్ హీరోయిన్ అని ముద్ర వేసుకుంది. ఇషా చావ్లా సినీ జీవితం నాశనం అవ్వడానికి ముఖ్య కారణం..  కథల విషయంలో ఈమె కాస్త జాగ్రత్తలు వహించి ఉంటే.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండేదని నెటిజన్స్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో వరుస ప్లాపుల ను చవి చూసి అవకాశాలను అందుకోలేకపోయింది. దీంతో దర్శకులు కూడా ఆమెను పక్కన పెట్టేశారు.

అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటుంది ఇషా చావ్లా.. తరచూ ఆమె కొన్ని ఫోటో షూట్లను క్యూట్ వీడియోలను షేర్ చేస్తూ ఉంది. ఇక తాజాగా ఇషా చావ్లా కరోనా వైరస్ బారిన పడినట్లు సమాచారం. కాగా.. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా అందరికీ తెలిపింది.

అంతేకాదు.. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా వెల్లడించింది. అంతేకాక.. ప్రతి ఒక్కరూ తగినన్ని జాగ్రత్తలు పాటించండి అంటూ ఆమె అభిమానులను శ్రేయోభిలాషులకు తెలిపింది. ఇక సినీ ప్రముఖులు ఇషాచావ్లా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా తన కెరీర్ ను తానే చేతులారా నాశనం చేసుకుందని చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: