ఏ దర్శకుడైనా ఏ హీరోకైనా రీమేక్ సినిమాలు చేయాలి అంటే మహా సరదా పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు నచ్చే విధంగా వివిధ రకాల దర్శకత్వ టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను తెరకెక్కించి తొందరగా ఈజీగా సూపర్ హిట్ ను అందుకోవచ్చు. అలా ఇప్పటివరకూ ఎంతోమంది దర్శకులు కలిసి రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకొని బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను రూపొందించగా ఇప్పటివరకు రీమేక్ సినిమా లి చేయని దర్శకులు కూడా రీమేక్ చేయాలనే విధంగా ఆలోచనలు చేస్తూ ఉండటం టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని కొంతమంది సినిమా విశ్లేషకులను ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆ విధంగా సుకుమార్ తనకు లేని రీమేక్ ఆలోచన ను ఓ సినిమాను చూసి రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడట. ఇటీవలే పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలుపుతూ తన తదుపరి చిత్రాలను భవిష్యత్తులో చేయబోయే చిత్రల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళంలో సూపర్ హిట్ అయినా విక్రమ్ వేద చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఉద్దేశం తనకు ఉంది అన్నట్లుగా మాట్లాడారు. తన కెరీర్లో ఇప్పటివరకూ రీమేక్ చేయని సుకుమార్ ఈ విధంగా ఇప్పుడు మాట్లాడడం ఆయన అభిమానులకు సైతం చాలా ఆశ్చర్యం అనిపించింది.

పుష్ప సినిమా విజయవంతం తర్వాత పుష్ప 2 సినిమాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన సుకుమార్ ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ విక్రమ్ వేద ఎప్పుడు చేస్తాడో అన్నది చూడాలి. అప్పటివరకు ఈ సినిమా తెలుగులో రాకపోతే పర్వాలేదు కానీ రాకపోతే సుకుమార్ ఈ చిత్రాన్ని చేస్తాడు అనడం లో ఏ విధంగానూ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక బాలీవుడ్ లో హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీ ఖాన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: